రోడ్డు ప్రమాదంలో సినీ గాయని దుర్మరణం - MicTv.in - Telugu News
mictv telugu

రోడ్డు ప్రమాదంలో సినీ గాయని దుర్మరణం

November 15, 2019

రోడ్డు ప్రమాదంలో ప్రముఖ మరాఠీ సింగర్ గీతా మాలి మృతిచెందారు. ముంబై-ఆగ్రా హైవేలో జరిగిన ప్రమాదంలో ఆమె తుది శ్వాస విడిచారు. తన భర్త విజయ్‌తో కలిసి గీతా మాలి అమెరికా వెళ్లారు. రెండు నెలల పర్యటన తర్వాత గురువారం ఇండియాకు తిరిగి వచ్చారు. ముంబై విమానాశ్రయం చేరుకొని తమ సొంత ఊరైన నాసిక్‌కు కారులో బయల్దేరారు.

తెల్లవారుజామున 3 గంటల సమయంలో రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న హెచ్‌పి గ్యాస్ కంటెయినర్‌ను వారు ప్రయాణిస్తున్న కారు బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారిద్దరినీ హుటాహుటిన సమీపంలో ఉన్న షాపూర్ రూరల్ హాస్పిటల్‌కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గీత మృతి చెందగా.. ఆమె భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె మరాఠీ సినిమాల్లో ఎన్నో పాటలు పాడారు. సొంతంగా మ్యూజిక్ ఆల్బమ్‌లను కూడా రూపొందించారు. ఆమె ఆకస్మిక మృతితో మరాఠీ చిత్రసీమ శోకసంద్రంలో మునిగింది. ఆమె మృతిని అభిమానులు తట్టుకోలేపోతున్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సంతాపం తెలుపుతున్నారు.