పెళ్లయిన ప్రతీ మహిళ మొదటగా చేసే పని భర్తను తన కంట్రోల్ లో పెట్టుకోవడం. అది సక్సెస్ అయితే మిగతావన్నీ ఆటోమేటిగ్గా సవ్యంగా జరిగిపోతాయని ఆశిస్తుంటారు. కానీ, తమ భర్తలు తమ మాట వినకపోతే తీవ్ర అసహనానికి లోనవుతుంటారు. చీటికీ మాటికీ గొడవలు పెట్టుకోవాలని చూస్తారు. అయితే ఈ గొడవలు కూడా కంట్రోల్ లో పెట్టుకోవడం కోసమేనని భావిస్తారు. కానీ అది తప్పంటారు ఆస్ట్రేలియాకు చెందిన 34 ఏళ్ల మార్గరాటా నజరెంకో. ఈమె భర్తలను కంట్రోల్ చేయడం ఎలా? అనే టాపిక్ పై మహిళలకు ఆన్ లైన్లో క్లాసులు చెప్తోంది. ఆమె ప్రకారం.. కొంచెం తెలివితేటలు, ఆడవాళ్లకు సొంతమైన కొన్ని అంశాలను ప్రయోగిస్తే మగమహారాజులను అదుపులో పెట్టుకోవడం చాలా సులువు అని చెప్తోంది. ఈ క్రమంలో మహిళలను మూడు జంతువులతో పోల్చింది. మొదటిది జింక. జింక స్త్రీకి శక్తికి ప్రతిరూపమని, ప్రమాదాన్ని సులభంగా గ్రహించి అక్కడ నుంచి వేగంగా వెళ్లిపోతుందని, మహిళలు కూడా జింకలా ఉండాలని సూచిస్తోంది. ఇక రెండోది ఆవు. సాధారణంగా ఆవులు పగలంతా అన్ని పనులు చేసి సాయంత్రానికి అలసిపోతుంది. మహిళ కూడా సాయంత్రం వరకు అన్ని పనులు చేసి తన గురించి ఆలోచించుకోదు.
అంటే మహిళలు ఒక హద్దు గీసుకొని అక్కడి వరకే బాధ్యతలు నెరవేర్చాలని తెలిపింది. మూడోది గుర్రం. కొందరు మహిళలు తామంటే ఇష్టం లేని మగవాళ్ల వెంట పడతారని, వారికోసం మొత్తం ఖర్చులన్నీ భరిస్తారంటూ ఇలాంటి గమ్యం తెలీని ప్రయాణం ప్రమాదకరమని చెప్తోంది. అందుకే ఎప్పుడూ తమ గురించి ఆలోచిస్తూ అప్రమత్తంగా ఉండాలని సలహా ఇస్తోంది. ఇవికాక, మరికొన్ని కీలకమైన సూచనలు చేసింది. భర్తలు తమ మాట వినాలంటే భార్యలు ముందు వారితో గొడవ పడడం మానెయ్యాలి. ఎప్పుడూ కూడా వారిలోని మంచి లక్షణాలను పొగుడుతూ ఉండాలి. చెడు అలవాట్లు ఉంటే అతను కూడా మర్చిపోలేనప్పుడు దాని గురించి వదిలెయ్యాలి. చాలావరకు మానసికంగా, కొంతవరకు శారీరకంగా బలంగా తయారవ్వాలి. అప్పుడు పురుషులు ఏం చెప్పినా వింటారని క్లాసుల ద్వారా మహిళలకు హితబోధ చేస్తోంది. మరి ఇవి ఎంతవరకు ఫలిస్తాయో పెళ్లయిన వారు చెప్పాలి.