జడుసుకోకండి.. ఈమె బ్యూటీ టిప్స్ చెబుతుంది.. - MicTv.in - Telugu News
mictv telugu

జడుసుకోకండి.. ఈమె బ్యూటీ టిప్స్ చెబుతుంది..

April 20, 2018

ఈమె పేరు మరిమర్ క్విరోరా. వయసు 23 ఏళ్లు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటోంది. సౌందర్య పోషణపై వీడియో పాఠాలు రూపొందించి ఇంటర్నెట్లో విడుదల చేయడం ఈమెపని! నవ్వుతున్నారు కదూ. చూడ్డానికి ‘వికారంగా’ కనిపిస్తున్న క్విరోరా ఏం బ్యూటీ టిప్స్ నేర్పుతుంది.. మీ మొహం మండ! అతని తిట్టకండి. ఆమె వీడియోలకు విపరీతమైన డిమాండ్ ఉంది. లక్షలాది అభిమానులు ఉన్నారు.

క్విరోరాకు పుట్టుక నుంచే సిస్టిక్ హైగ్రోమా ఉంది. మెడ, ముఖం చుట్టూ నీటిసంచులు ఉన్నాయి. దీంతో ఆమె వికారంగా, కోతిలా ఉందని అందరూ విమర్శించేవారు. కానీ ఆమె లెక్కచేయలేదు. ఆత్మవిశ్వాసాన్ని మించి అందం లేదని ముందుకు దూసుకెళ్లింది. ట్యూమర్ల వల్ల సరిగ్గా తినలేక, మాట్లాడలేకపోయినా ఆత్మస్థైర్యాన్ని ఎన్నడూ కోల్పోలేదు. తనలాంటి వారికోసం మేకప్ ఆర్టిస్ట్స్ గోర్డా66’ పేరుతో యూట్యూబ్ చానల్ నడుపుతోంది. వికలాంగుల కోసం చక్కని పాఠాలు బోధిస్తోంది..

‘మనం ఎలా ఉన్నామో అలా అంగీకరించి, మిగతావాళ్లు ఏమనుకుంటున్నారో పట్టించుకోకపోవడమే అసలైన అందం. మీ ముఖం ఎలా ఉన్నాసరే చక్కగా జనానికి చూపండి.. నేను చిన్నప్పుడు అద్దంలో నాతో నేనే మాట్లాడుకునేదాణ్ని. నాకు ఏవి నప్పుతాయో అన్నీ వివరంగా రాసిపెట్టుకునేదాన్ని.. అలా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకున్నాను..’ అని చెబుతోంది క్విరోరా. యూట్యూబ్‌లో ఆమెకు 30 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారంటే ఎంత మ్యాటర్ ఉందో అర్థం చేసుకోవచ్చు..!