కోలీవుడ్‌లో విషాదం.. తమిళ నటుడి ఆత్మహత్య - MicTv.in - Telugu News
mictv telugu

కోలీవుడ్‌లో విషాదం.. తమిళ నటుడి ఆత్మహత్య

September 29, 2020

'Marina' actor Thennarasu commits suicide

ముంబైలో ఇవాళ టీవీ నటుడు అక్షత్ ఉత్కర్ష్ అనే టీవీ నటుడి ఆత్మహత్య గురించి మరిచిపోకముందే తమిళనాడులో మరో యువ‌నటుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తెన్నార‌సు అనే నటుడు చెన్నైలోని మైలాపూర్‌లో మంగ‌ళ‌వారం త‌న నివాసంలో ఫ్యానుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్య‌తో గొడవ జరగడంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన అతను ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం. మూడేళ్ల క్రితం తెన్నార‌సు ఓ  యువ‌తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఓ బిడ్డ కూడా ఉంది.

తాగుడుకు బానిస అయిన అతను కరోనా కారణంగా షూటింగులు లేకపోవడంతో తాగుడు మరింత ఎక్కువ చేశాడని స్థానికులు తెలిపారు. తాగొచ్చి భార్య‌తో త‌ర‌చూ గొడ‌కు దిగుతున్నాడ‌ని చెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. కాగా, హీరో శివ‌కార్తికేయ‌న్ న‌టించిన ‘మెరీనా’ చిత్రంలో తెన్నారసు ముఖ్య పాత్రలో న‌టించాడు. హీరో స్నేహితుడిగా నటించిన తెన్నారసుకి మంచి పేరు వచ్చింది. అలాగే తెన్నార‌సు ప‌లు సినిమాల్లో హీరో స్నేహితుడి పాత్ర‌లో ఎక్కువ‌గా నటించాడు.