జుకర్ బర్గ్ కు రెండో పాప..!  - MicTv.in - Telugu News
mictv telugu

జుకర్ బర్గ్ కు రెండో పాప..! 

August 29, 2017

జుకర్ బర్గ్ ఎవరో తెల్సే కదా.. మనం ఎప్పుడు ముఖ పుస్తకంల మూతి వెడ్తం జుడు. అగో గ ఫేస్ బుక్ ను తయారుజేశ్నది గీయ్ననే. అయితే ఆయ్నకు ఇప్పుడు రెండో బిడ్డె పుట్టింది. మల్లా  ఆడబిడ్డ పుట్టినందుకు  జుకర్ మస్తు మురుస్తున్నడట. “నాకు బిడ్డ పుట్టిందని”  ఫేస్ బుక్ ల అందరితోని ఆయన ఆనందాన్ని  పంచుకున్నడు. ఆ పాపకు ఆగస్ట్ అని పేరు పెట్టిండు. గమ్మతున్నది గదా పేరు. మరి ఆగస్ట్  నెలల పుట్టిందని గ పేరు పెట్టిండో, లేక్పోతే ఇంకో కారణం ఉందో తెల్వది గనీ మొత్తం మీద.. ఇప్పుడు పుట్టిన గీ ఆగస్ట్ పాపకు గుడ ఫస్ట్ బిడ్డెకు రాసినట్టే ఓ ఉత్తరం రాసిండు.

‘డియర్‌ ఆగస్ట్‌.. ఈ ప్రపంచంలోకి నీకు స్వాగతం. నీ రాక కోసం మీ అమ్మా, నేను ఎంతో ఆత్రుగా ఎదురు చూశా. మీ అక్క మాక్స్‌ పుట్టినప్పుడు కూడా మేం ఇంతే ఆనందంగా ఉన్నాం. అప్పుడు కూడా ఇట్లనే ఉత్తరం రాసినం. నువ్వు మంచి విద్య, బలమైన బంధాలు, సమానత్వం ఉన్న ప్రపంచంలో పెరగాలని ఆశిస్తున్నాం. ఈ శాస్త్రసాంకేతిక కాలంలో మీరు మాకన్నా మంచి జీవితాన్ని అనుభవిస్తారని తెలుసు. అయితే దాన్ని నిజం చేయాల్సిన బాధ్యత మాపైనే ఉంది. బాల్యం చాలా అద్భుతమైనది. అది ఒకసారి మాత్రమే వస్తుంది. అందుకే ఆ బాల్యాన్ని నువ్వు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పరిపూర్ణంగా అనుభవించాలి. మేం నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం’ అని జుకర్‌ బర్గ్ తన బిడ్డెకు ఉత్తరం రాశిండు.