Mark Zuckerberg's 71 Billion dollar Wealth Wipeout Puts Focus On Meta Struggle
mictv telugu

జుకర్‌బర్గ్‌కు భారీ దెబ్బ.. ఈ ఏడాది రూ. 5.65 లక్షల కోట్లు మటాష్

September 20, 2022

ఫేస్‌బుక్‌ సహ-వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌కు ఈ ఏడాది భారీ షాక్ తగిలింది. 2022 ఆరంభం నుంచి ఆయన నికర సంపదలో 71 బిలియన్‌ డాలర్లు (అక్షరాలా రూ.5.65 లక్షల కోట్లు) ఆవిరైపోయాయి. కేవలం 55.9 బిలియన్ డాలర్ల నికర విలువతో మార్క్ జుకర్‌బర్గ్ ప్రపంచ బిలియనీర్‌లలో 20వ స్థానంలో ఉంది, 2014 నుండి ఇదే అత్యల్ప స్థానం. ఈ సంపద రెండేళ్ల కిందటే 106 బిలియన్ డాలర్లుగా ఉండటం గమనార్హం.

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అత్యంత సంపన్నులలో అతని నికర సంపద సగానికి తగ్గిపోయింది. 2014లో ప్రపంచ బిలియనీర్లలో రెండు స్థానంలో ఉన్నారు ఇటీవల కంపెనీ షేర్లు రికార్డు స్థాయిలో 24 శాతం పడిపోయాయి. అంచనాలకు భిన్నంగా మెటా బలహీన ఫలితాల కారణంగా చరిత్రలో అతిపెద్ద పతనాన్ని నమోదు చేసింది. అలా ఒక్క రోజులోనే మార్క్‌ సంపద 31 బిలియప్‌ డాలర్లకు పడిపోయింది. సెప్టెంబర్, 2021లో కంపెనీ షేర్లు 382 డాలర్ల వద్ద జుకర్‌ బర్గ్‌ అతని సంపద గరిష్టంగా 142 బిలియన్‌ డాలర్లగా ఉన్న సంగతి తెలిసిందే.

మెటావర్స్‌లో కంపెనీ పెట్టుబడులు పెట్టడం వల్ల స్టాక్ డ్రాప్ అవుతోందనీ, రాబోయే మూడు నుండి ఐదేళ్లలో “గణనీయమైన” సంపద కోల్పోతుందని తాను భావిస్తున్నట్లు నీధమ్ అండ్‌ కంపెనీ ఇంటర్నెట్ విశ్లేషకుడు లారా మార్టిన్ చెప్పారు. ప్రత్యర్థి టెక్‌ కంపెనీలైన అమెజాన్‌, యాపిల్‌, నెట్‌ఫ్లిక్స్‌, గూగుల్‌తో పోలిస్తే 2022లో షేరు విలువపరంగా అత్యధిక నష్టాలు చవిచూసిన సంస్థ మెటాయేనని తెలిపారు. ఈ ఏడాది ఆరంభం నుంచి కంపెనీ షేరు ధర 57 శాతానికి పైగా కుంగింది.