తబ్లిగీ జమాత్.. అక్కడి నుంచి ఎంతమందికి సోకిందో తెలిస్తే షాక్  - MicTv.in - Telugu News
mictv telugu

తబ్లిగీ జమాత్.. అక్కడి నుంచి ఎంతమందికి సోకిందో తెలిస్తే షాక్ 

April 4, 2020

Markaz prayers effect corona

ఢిల్లీలోని మర్కజ్ ప్రాంతంలో జరిగిన తబ్లిగీ జమాత్ ప్రార్థనల ఫలితంగా దేశవ్యాప్తంగా కరోనా వేగంగా విస్తరిస్తోంది. నాలుగు రోజులుగా నమోదవుతున్న కేసుల్లో సింహభాగం మర్కజ్‌తో సంబంధమున్నవే. ఢిల్లీ ఉదాహరణ మర్కజ్ వ్యాప్తి తీవ్రతకు ఎంతో అద్దం పడుతుంది. హస్తినలో ఇప్పటివరకు లెక్కతేలిన మొత్తం 386 కేసుల్లో 259 పాజిటివ్‌ కేసులు మర్కజ్ ప్రార్థనతో సంబంధమున్నవేనని రాష్ట్ర  ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ బయటపెట్టారు.

‘మర్కజ్ కు వెళ్లిన వారిపై నిఘా పెట్టాం. 600మందిని క్వారంటైన్‌కు తరలించాం. వారిని కలిసిన వారి వివరాలు రాబడుతున్నాం’ అని చెప్పారు. మరోపక్క.. దేశవ్యాప్తంగా 22 వేల మందికి పైగా తబ్లిగి జమాత్ కార్యకర్తలను, వారి సన్నిహితులను క్వారంటైన్‌కు తరలించారు. దేశంలో నమోదైన 300 వేల కేసుల్లో 30 శాతం తబ్లిగి జమాత్‌తో సంబంధమున్నవేనని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గత 24 గంటల్లో 601 కొత్త కేసులు బయటపడ్డాయి. తెలుగు రాష్ట్రాల నుంచి రెండు వేలమందికిపై మర్కజ్ వెళ్లడంతో దాదాపు అన్ని జిల్లాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.