Marri Shashidhar Reddy resigned from the Congress party
mictv telugu

కాంగ్రెస్‌కు భారీ షాక్.. పార్టీకి మర్రి రాజీనామా

November 22, 2022

మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ ‌బై చెప్పారు. ఈ మేరకు పార్టీ అగ్ర నేత సోనియాగాంధీకి లేఖ కూడా రాసినట్లు తెలిపారు. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవడంతో పాటు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు.. ఆయనపై కాంగ్రెస్ ఆరేళ్ల పాటు బహిష్కరణ వేటు వేసిన విషయం తెలిసిందే. బహిష్కరణకు గురైన అనంతరం తొలిసారి ఆయన మంగళవారం ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాల్టీ నుంచి కాంగ్రెస్ హోంగార్డుగా ఉండటం లేదని తెలిపారు. చాలా బాధతో కాంగ్రెస్‌తో బంధం తెచ్చుకుంటున్నానని చెప్పారు.

రాష్ట్రంలో పార్టీ పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతుందని, ప్రతిపక్ష పాత్రను పోషించడంతో కాంగ్రెస్ విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తు సూచించిన వారిలో తమ తండ్రి కూడా ఉన్నారనే విషయాన్ని శశిధర్ రెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడతానని, ఇలాంటి పరిస్ధితి వస్తుందని తాను ఊహించలేదన్నారు. పీసీసీ చీఫ్‌లకు ఇంఛార్జ్‌లు ఏజెంట్‌లుగా మారిపోయారని, ఇదే పార్టీకి పెద్ద మైనస్ అని శశిధర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.