Marri shashidharreddy Meets Amithsha
mictv telugu

బీజేపీలోకి మర్రి..ఆయన బాటలో ఇంకెందరు?

November 19, 2022

Marri shashidharreddy Meets Amithsha

కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారు. ఇందుకు అమిత్ షా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.మరి శశిధర్ బీజేపీలోకి వెళ్లడానికి కారణాలేంటి?రేవంత్ నాయకత్వం, పార్టీలో పరిణామాలపై అసంతృప్తితోనే కాంగ్రెస్‌ని వీడుతున్నారా? ఆయన బాటలో ఇంకెందరు నడుస్తారు?

కమలం కండువా…

కాంగ్రస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి శుక్రవారం రాత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షాతో భేటి అయ్యారు. ఈ సమావేశానికి బండి సంజయ్ , డీకే అరుణలు హాజరయ్యారు. 40 నిమిషాలపాటు చర్చించారు.పార్టీ మారబోతున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.అంతకుముందు గురువారం రాత్రి అమిత్ షాతో ఈటల రాజేందర్ భేటి అయ్యారు. మర్రిశశిధర్ రెడ్డి గురించి చర్చించారు. గ్రీన్ సిగ్నల్ రావడంతో అమిత్ షాను మర్రి కలిశారు. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. టీఆర్ఎస్‌ను దీటుగా ఎదుర్కొనేందుకుంద అనుసరించాల్సిన విధానాలపై చర్చించారు.

అక్కడ అంతే..

కాంగ్రెస్ కొనసాగుతోన్న పరిణామాలపై మర్రిశశిధర్ రెడ్డి ఎంతో కాలంగా అసంతృప్తిగా ఉన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఆయన వ్యతిరేకించారు. చాలాకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్‌లో ఉన్నారా, లేరా అనే డౌట్ కార్యకర్తల్లో ఉంది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక గాంధీభవన్ మెట్లు ఎక్కలేదు. అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు మర్రిశశిధర్ రెడ్డి యాక్టివ్ గానే పనిచేశారు. మరి శశిధర్ రెడ్డి ఎప్పటినుంచో కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. పార్టీలో ఆయనది ప్రత్యేకశైలి. హైదరాబాద్ నగరం పై మంచి పట్టున్న నేత.

మళ్లీ ఆకర్ష్ కమల్

తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కమలాన్ని మళ్లీ వేగవంతం చేసింది. ఈసారి కాంగ్రెస్ పార్టీపై దృష్టి సారించింది. పలువురి నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. మర్రిశశిధర్ రెడ్డి తర్వాత మరికొందరు నేతలు బీజేపీలోకి వస్తారని సమాచారం. ఇందుకోసం ఆ పార్టీ నేత డీకే అరుణ వ్యూహాలు రచిస్తున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలనాటికి కీలక నేతల్ని బీజేపీలోకి తీసుకెళ్లి ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు.