డీజే చప్పుడుకు ఆగిన పెళ్లి కొడుకు గుండె.. పెళ్లింట విషాదం - MicTv.in - Telugu News
mictv telugu

డీజే చప్పుడుకు ఆగిన పెళ్లి కొడుకు గుండె.. పెళ్లింట విషాదం

February 15, 2020

 

xfvxvb

బంధువులు, పెళ్లి భాజాలతో సందడిగా ఉండాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది. పెళ్లి బరాత్‌లో ఏర్పాటు చేసిన డీజే చప్పుడుకు పెళ్లి కొడుకు గుండె ఆగిపోయింది. దీంతో అతడు ఒక్కసారిగా కుప్పకూలిపోయి మరణించాడు. తాళి కొట్టిన గంటల వ్యవధిలోనూ హఠాత్తుగా వరుడు మరణించడంతో పెళ్లింట విషాదం నెలకొంది. నిజామబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

గణేష్ అనే వ్యక్తికి శుక్రవారం పెళ్లి జరిగింది. వేడుక ముగిసిన తర్వాత సాయంత్రం సంప్రదాయ బద్ధంగా ఊరేగిస్తూ ఇంటికి తీసుకువస్తున్నారు. ఈ సమయంలో బరాత్ కోసం డీజేను ఏర్పాటు చేశారు. అంతా కలిసి డీజే పాటలకు డ్యాన్స్ వేశారు. పెళ్లి కొడుకు గణేష్ కూడా స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేశాడు. చాలా సేపు డ్యాన్స్ చేయడం.. డీజే సౌండ్ అధికంగా ఉండటంతో అతని గుండె తట్టుకోలేక ఆగిపోయింది. వెంటనే అక్కడే కుప్పకూలిపోయాడు. బంధువులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ.. తుదిశ్వాస వదిలాడు. దీంతో నవ వధువుతో పాటు పెళ్లి కొడుకు కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.