Marriage cancelled At the last minute,
mictv telugu

పీటలపై ఆగిపోయిన పెళ్లి..కారణం తెలిస్తే షాక్

November 17, 2022

కాసేపట్లో పెళ్లి. అన్ని పనులు పూర్తయ్యాయి. కళ్యాణ మండపం బంధు మిత్రులతో కోలహలంగా ఉంది. మూడుముళ్ళ ముహర్తం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. సీన్ కట్ చేస్తే వైభవంగా జరగాల్సి పెళ్లి ఆగిపోయింది. మంచి లెహంగా కొనలేని వరుడు నా కొద్దు అంటూ వధువు పీటల మీద నుంచి వెళ్ళిపోయింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది..

రాజ్‌పురాకు చెందిన ఓ యవతికి, యువకుడికి జూన్‌లో నిశ్చితార్థం అయ్యింది. నవంబర్ 5న పెళ్లికి ముహర్తం ఖరారు చేశారు. దీంతో సంప్రదాయం ప్రకారం వరుడు తరుపు వారు వధువుకి వివాహ దుస్తులు కొనిచ్చారు. పెళ్ళి రోజు రానే వచ్చింది. ఈ క్రమంలో అంతా కుటుంబాలు వేదికపైకి వచ్చాయి. ఇంతవరకు అంతా బాగానే ఉన్నా…వధువుకి కేవలం రూ. 10వేల ఖరీదు చేసే లెహంగా కొనిచ్చారని వివాదం మొదలైంది. దీనిపై వధువు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెళ్లి వద్దని చెప్పేసింది. వరుడి తరఫు వారు, బంధువులు ఎంత మంది వెళ్లి బతిమాలినా ఆమె పెళ్లికి అంగీకరించలేదు. . చివరికి పోలీస్ స్టేషన్‌కి పంచాయతీ పోయింది. పోలీసులు చెప్పినా వధువు ఒప్పుకోకపోవడంతో చివరికి వివాహం రద్దైంది.