సప్తపదిలో గుట్టురట్టు.. తర్వాత మరో వరుడితో పెళ్లి! - MicTv.in - Telugu News
mictv telugu

సప్తపదిలో గుట్టురట్టు.. తర్వాత మరో వరుడితో పెళ్లి!

December 6, 2017

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ పెళ్లి.. సినిమా సీన్‌ను తలపించింది. పెళ్లికొడుకు తరపువారు.. అతడు వికలాంగుడు అన్న విషయాన్ని దాచిపెట్టి తంతు ముగించాలని చూడగా.. చుక్కెదురైంది. వధువు కుటుంబం ఆ పెళ్ళిని రద్దు చేసిన 18 గంటలు తిరక్కుండానే మరో వరుడిని వెతికి పట్టుకు పెళ్లి జరిపించారు.  నింబాజీలోని ఖోహ్‌కు చెందిన కల్యాణ్ సింగ్ కుమార్తె పింకీకి .. నారాయణ విహార్‌లోని ఓ యువకుడితో వివాహం నిశ్చయించారు. బంధువులందరూ తరలి వచ్చారు. వధూవరులు దండలు కూడా మార్చుకున్నారు. హోమగుండం చుట్టూ ఏడడుగులు వేయాల్సి ఉంది. సరిగ్గా అప్పుడే బండారం బయటపడింది. వరుడు వికలాంగుడని వధువు బంధువులు గుర్తించారు. ఈ సంగతి ముందే ఎందుకు చెప్పలేదని నిలదీశారు. గొడవ పెద్దదైంది. పోలీసులు రంగంలోకి దిగారు. సర్ది చెప్పడంతో పెళ్లి రద్దు అయింది. అయితే  పింకీ బంధువులు  18 గంటల్లోపే మరొక యువకుడ్ని చూసి పెళ్లి చేసేశారు.