కాబోయే భర్తకు దొంగపెళ్లి ఫోటోలు.. యువతి ఆత్మహత్య  - MicTv.in - Telugu News
mictv telugu

కాబోయే భర్తకు దొంగపెళ్లి ఫోటోలు.. యువతి ఆత్మహత్య 

June 5, 2020

Marriage Photos Viral in Whatsapp

ప్రియుడిని రహస్యంగా పెళ్లి చేసుకొని మరో వ్యక్తిని వివాహం చేసుకోవడానికి సిద్ధమైన ఓ యువతి చివరకు ప్రాణాలను వదిలింది. తమ పెళ్లి ఫొటోలను ప్రియుడు ఆమెకు కాబోయే భర్తకు వాట్సాప్ ద్వారా పంపించాడు. దీంతో అది వైరల్ కావడంతో మనస్తాపం చెంది ఈ దారుణానికి ఒడిగట్టింది. రంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్ మండలం కుదురుమళ్ల గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో పెళ్లి ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. 

కుదురుమళ్ల గ్రామానికి చెందిన మొసట్ల శైలేందర్ కూతురు స్రవంతి మహబూబ్‌నగర్‌లో బీఈడీ ఫస్టియర్ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన తిరుపతయ్యతో మూడేళ్లుగా ప్రేమాయనం నడిపింది. లాక్‌డౌన్‌కు ముందు వీరిద్దరు రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సెలవులు రావడంతో స్రవంతి ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో పెద్దలు కర్నాటకకు చెందిన వ్యక్తితో ఈ నెల 30న పెళ్లికి ముహూర్తం కుదిర్చారు. విషయం తెలిసిన తిరుపతయ్య వారి పెళ్లి ఫొటోలను వరుడికి పంపించాడు. మిగిలిన వాట్సాప్ గ్రూపులలోనూ వైరల్ చేశాడు. దీంతో తమ పరువు పోయిందని స్రవంతి తండ్రి ఆమెను నిలదీయడంతో ఆమె పురుగుల మందు తాగింది. ఆస్పత్రికి తరలించే లోపే మరణించడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. దీంతో తిరుపతయ్యతో పాటు మరో వక్తిని పోలీసులు అరెస్టు చేశారు.