ఘాటు ప్రేమ.. దానయ్య మీదొచ్చిన పడినా వేలు వదల్లేదు - MicTv.in - Telugu News
mictv telugu

ఘాటు ప్రేమ.. దానయ్య మీదొచ్చిన పడినా వేలు వదల్లేదు

September 25, 2020

Marriage proposal on busy Brooklyn Bridge goes exactly as you’d expect

చేసే వృత్తిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా కొందరు తమ పని తాము చేసుకుపోతుంటారు. అంతేగానీ, మధ్యలో ఓ ఆటంకం వచ్చిందని దానిని అస్సలు వాయిదా వెయ్యారు. అలా ఓ ప్రొఫెషనల్ పోటోగ్రాఫరమ్మ నడి రోడ్డుమీద తన మీద ఓ దారినపోయే దానయ్య వచ్చి పడినా.. తన కెమెరాను వదలకుండా ఫోటో షూట్ చేసి తీరింది. ఓ జంట తమ లవ్ ప్రపోజల్ సీన్‌ను ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకంగా భద్రపరుచుకోవాలని ఫోటో షూట్ నిర్వహించారు. ఎక్కడో ఏకాంతంగా అయితే ఏ సమస్యాలేదు. వాళ్లు వెరైటీగా ఉంటుందని నడిరోడ్డు మీద, వాహనాలు హోరులో ఫోటో షూట్ చేయించుకోవాలని భావించారు. వారి ఇష్టం సదరు ఫోటోగ్రాఫర్ చావుకొచ్చినంత పనైంది. 

న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ వంతెన ఈ విచిత్ర ఘటనకు వేదిక అయింది. ట్రాఫిక్ మధ్యలో ఓ అమ్మాయిని వివాహం చేసుకుంటావా అని అబ్బాయి మోకాలి మీద కూర్చుని ప్రపోజ్ చేస్తాడు. ఇదంతా కెమెరా ఉమెన్ తన కెమెరాలో బంధించాలి. అందుకోసం ఆమె రోడ్డు మీద పడరాని పాట్లు పడింది. ఫోటో తీస్తుండగా సైకిల్ మీద వెళ్తున్న ఓ వ్యక్తి బ్రేకులు కొట్టి అదుపుతప్పాడు. నేరుగా వచ్చి ఆమె మీద పడ్డాడు. అయినా ఆమె ఏమాత్రం తడుముకోకుండా తన కెమెరాను విడిచిపెట్టలేదు. సైకిలిస్టు తన సైకిల్ తీసుకుని అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఆమె యథావిధిగా తన కెమెరాతో వారి జ్ఞాపకాలను బంధించింది. ఇందుకు సంబంధించిన వీడియోను వరుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ‘మీరు మీ ప్రపోజల్‌ను ఎప్పటికీ మర్చిపోకూడదు అనుకుంటే న్యూయార్క్‌లో ప్రపోజ్ చేయండి’ అని పేర్కొన్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.