పారిశ్రామిక రంగంలో జపాన్ ముందు వరుసలో ఉంటుంది. అక్కడి ప్రజలు తోటి వారితో పోటీపడి తమ పని తీరునీ, ఉత్పాదకత స్థాయినీ పెంచుకుంటూ పోతుంటారు. ఇదే వారికి ఊహించని కష్టాల్లోకి నెట్టింది. ప్రతి ఏటా సంతానోత్పత్తి తగ్గిపోతోంది. అక్కడి ప్రజల్లోవైవాహిక బంధం, భార్య భర్తల ఏకాంతం తగ్గిపోవడంతో జననాలపై ప్రభావం పడింది. గత 25 సంవత్సరాలనుండి జపాన్ వృద్ధుల సంఖ్య పెరుగుతూ.. సంతానలేమి ఏర్పడుతోంది. దీనికి సరైనా చర్యల కోసం అక్కడి ప్రభుత్వం కొత్త పథకం అందుబాటులోకి తెచ్చింది. పెళ్లి చేసుకునే జంటకు రూ. 4 లక్షల అందించాలని నిర్ణయించింది.
దేశంలో జననాల రేటు పెరగాలంటే యువ జంటలకు నగదు బహుమతి ఆఫర్ చేసింది. చాలా మంది ఆదాయ వేటలో పడి పెళ్లి అనే మాటను మర్చిపోవడంతో ఈ విధంగా చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి పెళ్లి చేసుకునే జంటలకు రూ. 4 లక్షల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించింది. దీని వల్ల కొత్తగా కాపురం పెట్టే జంట ఇంటి అద్దె, ఇతర అవసరాలకు సరిపోతాయని భావిస్తోంది. ఇలా చేయడం వల్ల దేశంలో మళ్లీ జననాల రేటు పెరుగుతుందని పేర్కొంటున్నారు. అయితే 40 ఏళ్ల వయసు లోపు ఏడాదికి రూ. 5.4 లక్షల జీతం ఉన్నవారికి మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపింది.
అక్కడి ప్రజల్లో అధిక ఆదాయం కోసం ఆఫీసుల్లో ఓవర్డ్యూటీలు, నైట్ డ్యూటీలు చేయడం పెరిగిపోయిందట. చాలా మంది వివాహం చేసుకునేందుకు కూడా ఆసక్తి చూపట్లేదు. గడిచిన ఏడాది అక్కడ 8.65 లక్షల జననాలు మాత్రమే జరిగాయి. ఈ పరిస్థితిని అంచనా వేసిన ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.