Marriage Trolls On Hero Adivi Sesh
mictv telugu

చెల్లి పెళ్ళిలో హీరో అడివి శేష్ కి చేదు అనుభవం..!

January 24, 2023

అడివి శేష్ టాలీవుడ్‌ టు బాలీవుడ్ లో ఇప్పుడొక పాపులర్ హీరో. కిస్ వంటి సినిమాలు ఎన్నో చేసినా క్షణం మూవీతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుని.. వరుస సూపర్ హిట్స్ తో దూసుకెళ్తూ.. మొన్న మేజర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇక హిట్2 వంటి రీసెంట్ బ్లాక్ బస్టర్ తో మంచి ఊపుమీదున్న అడివిశేష్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని చెప్పొచ్చు. ప్రభాస్, శర్వానంద్ వంటి పెళ్లికాని ప్రసాదుల లిస్టులో టాప్ లో ఉంటాడు అడివి శేష్. అందుకే శేష్ ఎక్కడికి వెళ్లినా మొదటగా ఎదురయ్యే ప్రశ్నపెళ్ళెప్పుడు అనే. మొన్న ఆహా అన్ స్టాపబుల్ టాక్ షోకి వెళ్లిన అడివి శేష్ ని బాలయ్య కూడా ‘నీ పెళ్లెప్పుడయ్యా’ అంటూ ప్రశ్నిస్తే.. శర్వానంద్ పెళ్లి తరువాత అంటూ కొంటె సమాధానం చెప్పాడు శేష్.

దీనికి పక్కనే ఉన్న శర్వానంద్ బదులిస్తూ.. ‘నేనేమో ప్రభాస్ పేరు, నువ్వేమో నా పేరు చెప్పుకుంటూ బ్రతికేద్దాం’ అని పంచ్ ఇచ్చాడు. అయితే తాజాగా తన చెల్లి పెళ్ళిలో కూడా అడివి శేష్ కి ఇదే తరహా చేదు అనుభవం ఎదురైంది. ఈయ‌న రీసెంట్ గా త‌న చెల్లెలు పెళ్లి ఫొటోల‌ను త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. అమ్మ‌, చెల్లితో ఈ రోజు పెళ్లిలో స‌ర‌దాగా గ‌డిపాను. మా చెల్లెలు పెళ్లి జరిగింది. మా బావ డేవిన్‌ను మ‌న‌స్ఫూర్తిగా మా కుటుంబంలోఇక స్వాగ‌తిస్తున్నాం అంటూ ఆయ‌న మెసేజ్ కూడా షేర్ చేసుకున్నారు. దీంతో నెటిజ‌న్స్ శేష్ వాళ్ల సోద‌రికి పెళ్లి కంగ్రాట్స్ చెబుతూనే ఇంత‌కీ నీ పెళ్లి ఎప్పుడు అని ప్ర‌శ్నిస్తున్నారు. అయితే మరి వీటికి శేష్ సమాదానాలు ఏంటో చూడాలి. ఇక తాజాగా గూఢచారి 2 సినిమాలో నటిస్తున్నాడు అడివి శేష్.