ఏపీలో పెళ్లి వ్యాన్ బోల్తా.. ఏడుగురు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో పెళ్లి వ్యాన్ బోల్తా.. ఏడుగురు మృతి

October 30, 2020

ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ ఘాట్‌రోడ్డులోని వెంకటేశ్వరస్వామి దేవాలయం వద్ద పెళ్లి వ్యాను బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందితున్నారు. 

ప్రమాద సమయంలో వ్యాన్‌లో 17 మంది ఉన్నారు. మృతులను శ్రీదేవి, భాను, శ్రీలక్ష్మి, ప్రసాద్‌, దొరగా గుర్తించారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెళ్లి పూర్తయిన తర్వాత తిరిగి వస్తూ వ్యాన్‌ ప్రమాదానికి గురైంది. ఆలయంలో పార్కింగ్ ప్లేస్ మీదుగా రోడ్డు మీదికి రావాల్సిన వ్యాన్‌ మెట్లుపై నుంచి ఒక్కసారిగా కింద పడిందని తెలుస్తోంది. వధువు స్వస్థలం రాజానగరం మండలం వెలుగుబంద కాగా, వరుడు స్వస్థలం గోకవరం మండలం ఠాకూర్‌పాలెం.