370 రద్దుతో పెళ్లికళ వచ్చేసిందే బాలా..! - MicTv.in - Telugu News
mictv telugu

370 రద్దుతో పెళ్లికళ వచ్చేసిందే బాలా..!

August 29, 2019

Kashmir ...

జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్‌ 370 రద్దుతో కశ్మీర్ వాసులను ప్రేమించిన వారికి కష్టాలు తీరుతున్నాయి!  జంటలు భయంలేకుండా పెళ్లి పీటలు ఎక్కేస్తున్నాయి. ఇదివరకు కశ్మీర్‌ యువతులు ఇతర రాష్ట్రాల యువకులను పెళ్లాడితే కొన్ని ప్రత్యేక హక్కులు కోల్పేవారు. మోదీ ప్రభుత్వం 370 అధికరణను రద్దు చేయడంతో ఆ సమస్య కాస్తా తొలగిపోయింది. ఒక జంట పెళ్లికి శుభం కార్డు పడగా, రెండు జంటలకు కష్టమొచ్చిపడింది. 

శుభవార్త విషయంలోకి వస్తే.. రాజస్తాన్‌లోని  శ్రీగంగానగర్‌కి చెందిన అక్షయ్‌.. కశ్మీర్‌కు చెందిన కామినీ రాజ్‌పుత్‌ అనే యువతి కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ ఢిల్లీలో ఉన్నప్పుడు పరిచయమైంది. పెళ్లికి ఆర్టికల్ 370 వల్ల  వీరికి ఆస్తిపాస్తు, హక్కుల విషయాల్లో ఇబ్బంది ఎదురవుతుందని ఇద్దరి కుటుంబాలూ భయపడ్డాయి. 370 కాస్తా రద్దు కావడంతో ప్రేమపక్షులు పెళ్లాడేశాయి.  

ఇక విషాదవార్త విషయంలోకి వస్తే.. బిహార్‌లోని రామవిష్ణుపూర్ కు చెందిన పర్వేజ్,తబ్రేజ్ అనే అన్నదమ్ములు కశ్మీర్‌లో పనిచేస్తున్నప్పుడు అక్కడి యువతులను ప్రేమించారు. వారిద్దరూ అక్కచెల్లెళ్లే. 370 రద్దులో రెండు జంటలు పెళ్లాడాయి. భర్తలు భార్యలను స్వగ్రామానికి తీసుకొచ్చారు. అయితే తమ అమ్మాయిలను మోసం చేసి పెళ్లి చేసుకున్నారని వారి తండ్రి పోలీసులకు పోన్ చేశారు. కశ్మీర్ పోలీసులు బిహార్ కు వచ్చి కొత్త పెళ్లికొడుకులను అరెస్ట్ చేశారు. తాము ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నామని యువతులు వాదిస్తున్నారు.