Marriages vs Elections..Effect On Polling
mictv telugu

మూడు ముళ్లు-ముప్పతిప్పలు

November 8, 2022

Marriages vs Elections..Effect On Polling

గుజరాత్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. వ్యూహాప్రతివ్యూహాల్లో నేతలు మునిగితేలుతున్నారు.వాహనాలు ఎక్కి గల్లీ గల్లీ తిరుగుతున్నారు. ఇంతలో నేతలపై పెళ్లిళ్ల బాంబ్ పడింది.ఓట్ల వేటలో పెళ్లిళ్ల గోల ఏంట్రా బాబు అంటూ తలపట్టుకుంటున్నారు. పోలింగ్ రోజు వచ్చి ఓటేస్తారో లేదోనని టెన్షన్ పడుతున్నారు.

లక్షల్లో ముహుర్తాలు

దేశంలో రెండు, మూడేళ్లుగా సరైన పెళ్ళిళ్లు లేవు. కరోనాతో పెళ్లి కళ తప్పింది. గతేడాది కరోనా తగ్గినా అంతంతమాత్రంగానే వివాహాలు జరిగాయి. ఈ సారి కరోనా అడ్రెస్ లేకపోవడంతో గ్రాండ్ గా పెళ్లిళ్లు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ నెలరోజుల్లో లక్షల సంఖ్యలో వివాహాలు జరగబోతున్నాయి. దేశమంతా సంబరాల్లో ఉంటే గుజరాత్ నేతలు మాత్రం కలవరపడుతున్నారు.

అటు ఓట్లు..ఇటు మూడుముళ్లు…

అటు ఓట్ల పండుగ మొదలైంది. ఇటు పెళ్లిళ్ల సీజన్ షురూ అయింది. నవంబర్ 22 నుంచి డిసెంబర్ 14 దాకా లక్షల పెళ్లిళ్లు జరగబోతున్నాయి. ఢిల్లీలో మూడున్నర లక్షల వివాహాలు జరగబోతున్నాయి. గుజరాత్‌లో లక్షల్లోనే పెళ్ళిళ్లు ఉన్నాయి. డిసెంబర్ 1, 5 తేదీల్లో గుజరాత్‌లో రెండు విడుతల్లో పోలింగ్ జరుగుతుంది.నవంబరు 28,29తో పాటు డిసెంబర్ 2,4,8 తేదీలు శుభకార్యాలకు అనువైన ముహూర్తాలు. ఇవే సమాయాల్లో భారీ సంఖ్యలో వివాహాలు జరగబోతున్నాయని పండితులు చెబుతున్నారు.

పోలింగ్ పై ప్రభావం

పోలింగ్ పై పెళ్లిళ్ల సీజన్ ప్రభావం చూపే అవకాశం ఉంది. అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉంటే ఓటేయడానికి రాకపోవచ్చని పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. ముహూర్తాలు మార్చుకోమని ఎలాగూ చెప్పడం కుదరాదు..సో టైమ్ చూసుకోని వచ్చి ఓటేయాలని నేతలు కోరుతున్నారు. పెళ్లి పనుల్లో ఉన్నవారిని ఒప్పించే ప్రయత్నం చేస్తామన్నారు. ఇష్టమైన నాయకుడ్ని గెలిపించేందుకు ముందుకు రావాలని కాంగ్రెస్ , ఆప్ నేతలు కోరుతున్నారు.