అమరవీరుడి కూతురికి ఘోర అవమానం.. - MicTv.in - Telugu News
mictv telugu

అమరవీరుడి కూతురికి ఘోర అవమానం..

December 2, 2017

గుజరాత్‌లో ఒక అమర జవాను కూతురిని ఘోరంగా అవమానించారు. పోలీసులు సాక్షాత్తూ ముఖ్యమంత్రి సభ నుంచి ఆమె ఈడ్చుకుని బయటికి గెంటేశారు. తలదాచుకోవడానికి కాసింత భూమి కోసం ఆమె చేసిన వినతి పోలీసుల ఉక్కుపిడికళ్లకు బలైపోయింది. దీనిపై ప్రజలు, విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సీఎం విజయ్ రూపానీ వడోదర జిల్లా కేవడియాలో పాల్గొన్న బీజేపీ సభలో శుక్రవారం ఈ ఘోరం జరిగింది. రూపా తాడ్వి అనే 26 ఏళ్ల యువత సభకు వచ్చింది. తన తండ్రి అశోక్  సైన్యంలో విధినిర్వహణ చేస్తూ చనిపోయాడని, తమకు భూమి ఇచ్చి ఆదుకుంటామన్న ప్రభుత్వం చెప్పిందని, ఈ హామీ నెరవేర్చాలని ఆమె కోరింది. సీఎంను కలవడానికి తనకు అనుమతివ్వాలని అభ్యర్థించింది. అయితే పోలీసులు, బీజేపీ నేతలు అందుకు ససేమిరా అన్నారు. ఆమెను అక్కడి నుంచి బలవంతంగా గెంటేశారు. వివాదం ముదరడంతో సీఎం స్పందించారు.  బాధితురాలిని అన్ని రకాలుగా ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ ఘటనపై దుమారం రేగింది. గొప్ప దేశభక్తుడినని టాంటాం వేసుకునే విజయ్ రూపానీ అమర జవాను కుమార్తెను తన పోలీసులు ఈడ్చుకెళ్తుంటే ఏం చేస్తూ కూర్చున్నారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. దీనికి రూపానీ కూడా బదులిస్తూ.. జవాన్లను బీజేపీనే గౌరవిస్తుందన్నాడు.

https://twitter.com/OfficeOfRG/status/936603290439008258