పదేళ్ల సంతాన కల ఫలించేలోగా.. పాక్ బలితీసుకుంది.. - MicTv.in - Telugu News
mictv telugu

పదేళ్ల సంతాన కల ఫలించేలోగా.. పాక్ బలితీసుకుంది..

October 23, 2018

పిల్లల కోసం పదేళ్లుగా పరితపించిన ఓ జవాన్ కల ఫలించేందుకు కొన్ని గడియల ముందు విధి పాకిస్తాన్ రూపంలో అతణ్ని పొట్టనబెట్టుకుంది. రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ ఈ లోకంలోకి వచ్చేసరి అతడు నిష్క్రమించాడు. కుటుంబాన్నే కాకుండా విషయం తెలిసిన అందర్నీ భావోద్వానికి గురిచేస్తోందీ సంఘటన.  

Wife delivers baby girl hours before his cremation wife wants her newborn to join the army they want the child from ten years

కశ్మీర్ సరిహద్దులో ఆదివారం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో రంజీత్ సింగ్ భూత్యాల్(36) అనే జవాను చనిపోయాడు. అతని అంత్యక్రియలను కుల్గాంలోని రాంబాన్ గ్రామంలో మంగళవారం నిర్వహించారు. అవి పూర్తికాకముందే ఉదయం 5 గంటలకు భార్య సింపూ దేవి పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. తమ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డను చూడకుండా భర్త వెళ్లిపోయాడని దేవి కన్నీటిపర్యంతమైంది. కూతురిని తీసుకుని అంబులెన్స్‌లో వచ్చి భర్తకు కడపటి వీడ్కోలు పలికింది.  రంజీత్ సింగ్..  తన భార్య ప్రసవం కోసం మంగళవారమే ఇంటికి రావాల్సి ఉండిందని అంతలోపే ఈ ఘోరం జరిగిందని బంధువులు చెప్పారు. కాగా, తన కూతుర్ని కూడా ఆర్మీలో చేరుస్తానని రం దేవి భార్య ప్రతినబూనింది. పాక్ ఉగ్రమూక జరిపిన కాల్పుల్లో రంజిత్ సహా ముగ్గురు జావాన్లు బలయ్యారు.