అమృత ఫిర్యాదుతో..ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారతీరావు అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

అమృత ఫిర్యాదుతో..ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారతీరావు అరెస్ట్

December 1, 2019

Maruti rao .

గతేడాది సెప్టెంబర్ మాసంలో తన కూతురు అమృతను కులాంతర వివాహం చేసుకున్నాడని మారుతీరావు కిరాయి వ్యక్తులతో పెరుమాళ్ల ప్రణయ్‌ను దారుణంగా హత్య చేయించిన సంగతి తెలిసిందే. ఆ కేసులో మారుతీరావుతో పాటు మరికొందరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు బెయిల్‌పై బయటికి వచ్చారు. తాజాగా ఈ కేసులో మారుతిరావుని పోలీసులు మళ్ళీ అరెస్ట్ చేశారు. తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని అమృతను బెరించారనే అభియోగం మేరకు మారుతీరావుతో పాటు మరో ఇద్దరిని శనివారం పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఈ నెల 11వ తేదీన కందుల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి అమృత ఇంటికి వెళ్లి తనను మారుతీరావు పంపించాడని తెలిపాడు. ప్రణయ్‌ హత్య కేసులో  సహకరించి మీ తండ్రి వద్దకు వస్తే ఆస్తిని మొత్తం నీ పేరుపై రాసి ఇస్తాడని చెప్పాడు. దీంతో అమృత వెంటనే పోలీసులకు ఫోన్‌చేసి సమాచారం అందించింది. దీంతో పోలీసులు కందుల వెంకటేశ్వర్లును అరెస్ట్ చేసి విచారించారు. ఈ విచారణలో మారుతీరావు, ఎంఎ కరీంలు తనను పంపారని అంగీకరించడంతో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. అమృత ఫిర్యాదు మేరకు ఈ ముగ్గరు వ్యక్తులపై బెదిరింపులు, సాక్షిని ప్రలోభపెట్టడం వంటి కేసులను నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.