అమ్మాకాల్లో రికార్డు బ్రేక్ చేసిన మారుతి ఆల్టో - MicTv.in - Telugu News
mictv telugu

అమ్మాకాల్లో రికార్డు బ్రేక్ చేసిన మారుతి ఆల్టో

November 26, 2019

Maruti Suzuki Alto Completes 15 Years in India With Over 38 Lakh Units Sold

2000 సంవత్సరంలో మార్కెట్లోకి ప్రవేశించిన మారుతి ఆల్టో మరోసారి కింగ్ అనిపించుకుంది. చిన్నకార్లలో తానే తోపునని.. తనను ఇష్టపడేవారు కోకొల్లలు అని తన అమ్మాకాల ద్వారా నిరూపించింది. గ్రామీణ ప్రాంతాలవారిని, మధ్య తరగతివారిని మారుతీ ఆల్టో కారే షికారు చేసింది. సొంత కారు మాకూ ఉంది అనే ధీమాను వారిలో కల్పించింది. దశాబ్దకాలం పైగా  తిరుగులేని ఆధిపత్యంలో ఉంది. 

ఈ ఏడాది కూడా ఆల్టో అమ్మకాల్లో ఆల్ టైమ్ రికార్డు బ్రేక్ చేసింది. ఇతర పోటీదార్లను వెనక్కినెట్టి ముందుకు పోయింది. ఇప్పటివరకు తాము 38 లక్షల ఆల్టో కార్లను విక్రయించినట్టు మారుతి అధికారులు తెలిపారు. మారుతి సుజుకి ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ‘ఆకట్టుకునే స్టైల్, అందుబాటు ధర, అధిక మైలేజి వంటి అంశాలు ఆల్టో అమ్మకాల్లో పురోగతికి దోహదపడుతున్నాయి. మారుతున్న మార్కెట్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మారుతి సంస్థ ఆల్టో బీఎస్-6 వెర్షన్‌ను కూడా తీసుకువచ్చింది’ అని తెలిపారు.