మేరీ కోమ్‌కు పద్మవిభూషణ్, సింధుకు పద్మభూషణ్ ! - MicTv.in - Telugu News
mictv telugu

మేరీ కోమ్‌కు పద్మవిభూషణ్, సింధుకు పద్మభూషణ్ !

September 12, 2019

PV Sindhu......

ప్రపంచ క్రీడారంగంలో భారత కీర్తిపతాకాన్ని రెపరెపలాడిస్తున్న తెలుగు తేజం, స్టార్ బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు అత్యున్నత పురస్కారానికి క్రీడా మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. బాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న పీవీ సింధును పద్మభూషణ్‌ అవార్డుకు ప్రతిపాదించింది. మొత్తం తొమ్మిదిమంది క్రీడాకారులను పద్మపురస్కారాలకు ప్రతిపాదించినట్టు సమాచారం. వారిలో పీవీ సింధు ఒకరు. 

2015లో పీవీ సింధును భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఇక 2017లో పద్మభూషణ్‌కు సింధు పేరును క్రీడాశాఖ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అలాగే బాక్సింగ్‌లో ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన మేరీ కోమ్‌ను పద్మవిభూషణ్‌ పురస్కారానికి కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. పద్మవిభూషణ్‌కు నామినేట్ అయిన తొలి క్రీడాకారిణిగా మేరీ కోమ్ ఘనత సాధించింది. 2013లో పద్మభూషణ్, 2006లో పద్మశ్రీ అవార్డులను మేరీ కోమ్ అందుకున్నారు. పీవీ సింధు బయోపిక్ రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మేరీ కోమ్ బయోపిక్ ఇప్పటికే విడుదలై మంచి విజయం సాధించింది. ఆ చిత్రంలో మేరీ కోమ్ పాత్రలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నటించింది.