బొందలగడ్డలో మానవత్వం - MicTv.in - Telugu News
mictv telugu

బొందలగడ్డలో మానవత్వం

June 8, 2017


మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు అని కవి అందెశ్రీ అంటే ఏమో అన్కున్నంగనీ నిజమే అన్పిస్తున్నది,మనదేశం పక్కదేశం బైటిదేశం అనేగాదు ఎక్కడ జూశినా….పచ్చనోట్లకోసమో పరపతికోసమో ఆస్తులకోసమో పాకులాడే స్వార్ధపరులే ఎక్కువైతున్నరు..మచ్చుకైనా మనిషనెటోడు కానస్తలేడు..ఈయ్నకు జర్గింది తెలిస్తే మీరుగుడ నిజమే అని ఒప్పుకుంటరు…పోట్వలున్న ఈయ్న పేరు కిక్ మెట్ సలేవ్, రష్యా రాజదాని మాస్కో నగరంలుంటడు….దోస్తులతోని గల్శి బిజినెస్ స్టార్ట్ జేశిండు…బిజినెస్ల లాభమే అచ్చిందో నష్టమే అచ్చిందో.. మాపైసలు మాకు ఇయ్యుమని అందరు పార్ట్ నర్లు కూడి ఈయ్నమీద్కి దండయాత్ర జేశిన్రట…పాపం ఆయ్నదగ్గర టైంకు పైసలున్నయో లెవ్వో…మెల్లెగిస్తా అన్నడట,ఆహా… నువ్విట్లైతె ఇనవ్ అని..కిడ్నాప్ జేపిచ్చి బతికుండగనే బొందలగడ్డకు ఎత్కపొయ్యి సమాది జేపిచ్చిన్రు పుణ‌్యాత్ములు..ఆయ్న లబ లబ మొత్తుకుంటా..మీపైసలు ఏడికివోవురా అని జెప్పినా ఆళ‌్ళ మన్సు కర్గలే,పెట్టెలవెట్టి బతికుండంగనే సమాదిజేశిన్రు, పాపం ఆయ్నకు ఏం జెయ్యాల్నో అర్ధంగాలె లోపటంత శీకటి..

గాలిలేదు,బత్కుమీద ఆశ ఇడ్శిపెట్కుండట..ఇంతల్నే జేబుల ఏదో సప్పుడైంది..అదృష్టం మంచిగుండి ఆయ్న జేబుల ఫోనుంది…తిప్పలవడి జేబులకేలి పోన్ దీసి తమ్మున్కి పోనుగొట్టిండు…అరెయ్ జల్దిన రారా ఇట్ల ఇట్ల పరిస్డితి అని మొత్తం జెప్పిండు…పాపం తమ్ముడు ఎంబట్నే అన్నజెప్పిన బొందలగడ్డకచ్చిండు…అన్న ఏడున్నడో ఎర్కగాలె మొత్తం దిర్గిండు..అన్నకు ఫోన్జేస్తె పోను గల్వలే…ఏడ్సుకుంట అన్న బిజినెస్ జేశ్న పార్ట్ నర్ల దగ్గరికి వోయిండు..ఆళ్ళ కాళ‌్లమీదపడి మీకు దండం బెడ్తా మీ పైసలేడ్కివోవు..మాఅన్నకు ముగ్గురు శిన్నపిల్లలు ఆళ‌్లు ఆగమైతరు..అని ఎంత మొత్తుకున్నా…ఆ పుణ‌్యాత్ముల మన్సుకర్గలే, లెలెలె మా పైసలు మాకిస్తనే సమాదేడుందో శెప్తం అని జిజ్జు పట్టు వట్టిన్రట…ఎంబట్నే అన్నకున్న బిఎండబ్యూ కారు..ఇల్లు కాయిదాలు ఆడీడ పైసలడుకచ్చి ఆళ్లకిస్తె అప్పుడు జెప్పిన్రట…జల్దినవొయ్యి బొందదవ్వి ఆయ్నను బైటికిదీశిండు…పాపం నాల్గంటలు గాలాడక సమాదిలుండెవర్కు సృహదప్పి పడిపోయిండట..దవాఖాన్లకు తీస్కపోతె బత్కి బట్టకట్టిండట,సూడున్రి…మన్షులమెట్ల తయారైనమో…ఇన్నిరోజులు కల్శి బిజినెస్ జేశ్న మనోడెగదా..అరె పైసలు ఇయ్యల్ల గాక్పోతె రేపస్తయని ఒక్కలు గుడ ఆలోశన జెయ్యలే..ఆళ్లు సమాది జేశింది మన్షిని గాదు…మనుషుల్లో ఉన్న జాలి దయ కరుణ…సాయం,మానవత్వం.. అన్నిటిని సమాదిజేశిన్రు,పక్కోడు ఏట్లవోతేంది గంగలవోతేంది, మనజేబు నిండిందా మనకడ్పునిండిందా అనే గొప్ప ఆలొశనతోని బతుకుతున్నం…బతికేద్దాం,మన్షుల గొప్పతనాన్ని అర్ధంజేస్కునేటంత తెల్వి మిగతా జీవరాశులకుంటే …నయ్యమయింది మమ్లను మన్షులుగా పుట్టియలే అని దేవున్కి ఎన్నిసార్ల దండం పెట్కునేటివో….