మాస్కులు పంచిన వ్యక్తికి కరోనా.. తీసుకున్నవారిలో టెన్షన్ - MicTv.in - Telugu News
mictv telugu

మాస్కులు పంచిన వ్యక్తికి కరోనా.. తీసుకున్నవారిలో టెన్షన్

June 5, 2020

Mask Distribution Person Infected Corona

కరోనా సోకకూడదని ముందు జాగ్రత్తగా ప్రజలకు మాస్కులు పంచిన ఓ వ్యక్తి ఆ వైరస్ బారిన పడ్డాడు. తమిళనాడులో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. దీంతో అతని నుంచి మాస్కులు తీసుకున్నవారు భయాందోళనకు గురౌతున్నారు. తమకు ఎక్కడ వైరస్ అంటుకుంటుందోనని వణికిపోతున్నారు. దీంతో అతన్ని ఐసోలేషన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

తంజావూర్ జిల్లా వవూసి నగర్‌కు చెందిన ఓ యువకుడు ‘మక్కల్ పాదై’ స్వచ్ఛంద సంస్థ తరపున కరోనా సేవలు ప్రారంభిచారు. దీంట్లో భాగంగా మాస్కులు పంపిణీ చేశాడు. చెన్నై వెళ్లి అక్కడ అనేక ప్రాంతాల్లో తిరిగి ఉదారంగా ఉచితంగా అందించాడు. ఆ తర్వాత తిరిగి తంజావూరు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో అతడు తాజాగా అనారోగ్యబారిన పడ్డాడు. వెంటనే అతనికి పరీక్షలు జరపగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఈ ఘటన సంచలనం రేపింది. కాగా ఇప్పటికే అక్కడ  25,872 మందికి వైరస్ సోకింది.