మాస్క్ వ్యతిరేకులను పట్టించే టెక్నాలజీ.. తొలిసారి తెలంగాణలో - MicTv.in - Telugu News
mictv telugu

మాస్క్ వ్యతిరేకులను పట్టించే టెక్నాలజీ.. తొలిసారి తెలంగాణలో

May 8, 2020

Maskless face identification telangana police

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రస్తుతం ఉన్న మందులు రెండే రెండు. మాస్కులు, భౌతిక దూరం! వాటిని తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వాలు నెత్తీనోరూ కొట్టుకుంటున్నా చాలా మంది ఖాతరు చెయ్యడం లేదు. దీంతో మాస్క్ లేకుండా రోడ్డెక్కితే రూ. 1000 జరిమానా వేస్తామని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది. అయినా మాస్కులతో మాకేం పనంటూ కొందరు ఉత్తముఖాలతో రోడ్డుక్కుతున్నారు. 

వారిని వారిని పట్టుకోడానికి తెలంగాణ పోలీసులు దేశంలోనే తొలిసారిగా కృత్రిమ మేధతో పనిచేసే ఆధునిక టెక్నాలజీని తీసుకొచ్చారు. డీప్ లెర్నింగ్ టెక్నిక్‌ సాయంతో సర్వైలెన్స్ సీసీటీవీ కెమెరాలను వాడి అలాంటి వారి బండారం బయటపెడతారు. రోడ్లపై తిరిగే వాళ్ల ముఖాలు ఈ టెక్నాలజీ ద్వారా స్పష్టంగా కనిపిస్తాయి. ఎవరు మాస్క్ పెట్టుకున్నారో, ఎవరు పెట్టుకోలేదో సులభంగా గుర్తించవచ్చు. మాస్కు వ్యతిరేకులు ఎక్కడెక్కడున్నారో తెలుసుకున్న తర్వాత స్థానిక పోలీసులు వారి చెంతకు వెళ్లి జరిమానా వసూలు చేస్తారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో కొన్ని చోట్ల మొదట ఈ విధానం ప్రవేశపెడుతున్నారు.