వైరస్‌కూ వైసీపీ రంగు.. మాస్కులు, శానిటైజర్లనూ వదల్లేదు.. - MicTv.in - Telugu News
mictv telugu

వైరస్‌కూ వైసీపీ రంగు.. మాస్కులు, శానిటైజర్లనూ వదల్లేదు..

March 24, 2020

cvn

ఇటీవల సర్వేపల్లి వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాస్క్‌లు పంపిణీ చేశారు. అయితే ఆ మాస్క్‌లు, శానిటైజర్ బాటిళ్లపై వైసీపీ జెండాలు ముద్రించడంపై విమర్శలు ఎదురవుతున్నాయి. ఆఖరికి మాస్కులను కూడా వదలరా? ప్రజల ఆరోగ్యానికి చేస్తున్న సాయంలో కూడా పార్టీ ప్రచారం చేసుకుంటున్నారని సోషల్ మీడియాలో ఘాటుగా స్పందిస్తున్నారు. అయితే ఇందులో తప్పేమీ లేదని వారి అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

cvn

మరోవైపు చేతి పరిశుభ్రతకు అవసరమైన శానిటైజర్లను చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఉచితంగా పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ నేపథ్యంలో బహిరంగ మార్కెట్లలో శానిటైజర్లు దొరకడం కష్టంగా మారింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజల ఆరోగ్యం కోసం ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రతి ఒక్కరూ చేతులు శుభ్రంగా ఉంచుకుని కరోనా వైరస్‌ను తరిమి కొట్టాలి’ అని చెవిరెడ్డి పిలుపునిచ్చారు. తుమ్మలగుంట వేద పాఠశాల ఆవరణలో సుమారు 3.40 లక్షల శానిటైజర్‌ బాటిళ్లను ఇంటింటికీ రెండు చొప్పున ఉచితంగా పంపిణీ చేశారు.