Masood Azhar is not here..in Pakistan: Taliban
mictv telugu

మసూద్ అజార్ ఇక్కడ లేడు..పాక్‌లోనే ఉన్నాడు: తాలిబన్లు

September 15, 2022

దేశవ్యాప్తంగా 2010వ సంవత్సరంలో జరిగిన పుల్వామా దాడి ఎంత కలవరం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ దాడిలో మొత్తం 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. అయితే, ఈ ఘటనకి సంబంధించి, మాస్టర్‌మైండ్‌గా వ్యవహరించిన నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ తమ దేశంలో లేడని, పాకిస్తాన్‌లోనే ఉన్నాడని ఆప్ఘనిస్థాన్ ఘాటు సమాధానాన్ని ఇస్తూ, తాజాగా రాసిన ఓ లేఖ వైరల్‌గా మారింది. ఆప్ఘనిస్థాన్ దేశంలో అజార్ ఉన్నాడని, గతకొన్ని రోజులుగా పాకిస్తాన్ పదేపదే ఆరోపణలు చేస్తుండడంతో ఆఫ్ఘాన్ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది.

వివరాల్లోకి వెళ్తే.. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను వెతికి పట్టుకోవాలని పాకిస్తాన్ విదేశాంగశాఖ తాలిబన్లకు మంగళవారం లేఖ రాసింది. ఈ విషయాన్ని పాక్ మీడియా వెల్లడించింది. పాకిస్తాన్‌ లేఖపై ఆగ్రహించిన ఆప్ఘనిస్థాన్.. ఘాటు సమాధానాన్ని ఇచ్చింది. ”మసూద్ అజాద్ మీ పాకిస్తాన్‌లోనే ఉన్నాడు. ఆప్ఘనిస్థాన్‌లో లేడు. ఈ విషయాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలి. మాపై ఇలాంటి ఆరోపణలను మరోసారి చేస్తే, అది రెండు దేశాల సంబంధాలపై ప్రభావం చూపుతుంది. అజార్ మా దేశంలో ఉన్నాడనే ఆరోపణలకు స్పష్టమైన ఆధారాలను చూపించిన తర్వాతే, ఇలాంటి లేఖలు రాయాలి” అని తాలిబన్లు తీవ్రంగా మండిపడ్డారు.

నిషేధిత ఉగ్రవాద సంస్థ, చీఫ్ మసూద్ అజర్ విషయానికొస్తే.. ప్రస్తుతం అఫ్ఘానిస్థాన్లోని సంగ్రహార్ ప్రావిన్స్ లేదా కునార్ ప్రావిన్స్‌లో తలదాచుకొని ఉండొచ్చని పాక్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఏడాది జూన్‌లో 30 మంది ఉగ్రవాదులను వెతికి వారిపై విచారణ జరపాలన్న భారత్ డిమాండకు ఎస్ఏటీఎఫ్‌లో పశ్చిమ దేశాలు మద్దతు తెలిపాయి. ఈ ఉగ్రవాదుల్లో లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్, ఆపరేటీవ్ సాజిద్ మిర్ కూడా ఉన్నారు. వీరు 2008 ముంబయి దాడులకు మాస్టర్ మైండ్లుగా పనిచేశారు. ఐరాస ఉగ్రవాదులుగా గుర్తించిన వారిపై పాకిస్తాన్ చర్యలు తీసుకోవాలని ఎస్ఏటీఎఫ్ నుంచి ఒత్తిడి పెరుగుతోంది. వాస్తవానికి మసూద్ అజర్‌ను భారత్ గతంలోనే అరెస్టు చేసింది. కానీ, 1999లో విమానం హైజాక్ చేసి, ఉగ్రవాదులు అతడిని విడిపించారు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించారు. భారత్ ఇతడిని ఎప్పటి నుంచో అప్పగించమని కోరుతోంది.