హైదరాబాద్ మసీదుల్లోకి మహిళలు - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్ మసీదుల్లోకి మహిళలు

October 1, 2018

కాలం మారుతోంది. ఆలోచనా విధానాల్లో మార్పులు వస్తున్నాయి. మహిళలపై వివక్షకు తెరపడుతోంది. శబరిమల అయ్యప్ప గుడిలోకి మహిళలను కూడా వెళ్లనివ్వాలన్న సుప్రీం కోర్టు తీర్పును పలువురు స్వాగతిస్తుండగా సంప్రదాయ వాదులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మత విషయాల్లో కోర్టుల జోక్యమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ చర్చ ఇలా సాగుతుండగా మరోపక్క హైదరాబాద్‌లో కొన్ని మసీదులు మహిళలకు కూడా తలుపులు తెరుస్తున్నాయి.

Indo-Arab mosque opens for all at Banjara Hills part of Visit my masque programme

బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 10లోని ఇండో అరబ్ లీగ్‌కు చెందిన మస్జిద్ రహ్మత్ ఏ ఆలం మసీదులోకి ఆదివార మహిళలతోపాటు అన్ని మతాల, వర్గాల ప్రజలను అనుమతించారు. సమాజంలో భిన్నమతాలు, వర్గాల మధ్య సామరస్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. మతపెద్దలు ఇస్లాం ప్రార్థన, బోధనలను వివరించారు. విజిట్ మై మాస్క్యూ కార్యక్రమంలో భాగంగా ఈ అన్ని వర్గాల వారినీ అనుతించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం కింద ఇటీవల బేగంపేటలోని జామా మసీదులోకి కూడా మహిళలను అనుమతించారు.