ఏపీపీఎస్సీ నేడు(జనవరి 08) నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలో ఓ వ్యక్తి మాస్ కాపీయింగ్‌కు పాల్పడి పట్టుబడ్డాడు. అధికారుల కళ్ళగప్పి మొబైల్‌తో ఎగ్జామ్ హాల్ లోకి వచ్చిన అభ్యర్థి.. గూగుల్‌లో చూస్తు సమాధాలు రాస్తుండగా అధికారులకు దొరికిపోయాడు. వెంటనే అతడిని పోలీసులకు అప్పగించారు. విజయవాడ బెంజి సర్కిల్ లోని నారాయణ కళాశాలలో ఈ ఘటన జరిగింది. దొరికిపోయిన అభ్యర్థి పోరంకి సచివాలయ ఉద్యోగి కొల్లూరు వెంకటేశ్‌గా పోలీసులు తెలిపారు.
రాష్ట్రంలో అత్యున్న ఉద్యోగాల కోసం గత సంవత్సరం ఆక్టోబర్‌లో నోటిఫికేషన్ విడుదలు చేశారు. ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్లో మొత్తం 92 పోస్టులు ఉన్నాయి. నేడు ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించారు. మొత్తం 18 జిల్లాల్లో 297 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్ 1 .. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పేపర్ 2 పరీక్షలు జరిగాయి. ఇక ఈ గ్రూప్ 1 పరీక్షకు 1,26,449 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగ 75 శాతానికిపైగా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫలితాలు వారం రోజుల్లో వెల్లడి కానున్నాయి. ఫలితాలు వెల్లడించిన 90 రోజుల వ్యవధిలోనే మెయిన్స్ పరీక్ష ఉంటుంది.