బారులో కాల్పులు.. 11 మంది మృతి - MicTv.in - Telugu News
mictv telugu

బారులో కాల్పులు.. 11 మంది మృతి

May 20, 2019

‘Massacre’ reported at Brazil bar, media says 11 dead after 7 gunmen opened fire.

బ్రెజిల్‌లో ఆదివారం రాత్రి ఘోరం జరిగింది. పారా రాష్ట్రంలో బార్‌లో జరిగిన కాల్పులలో 11 మంది ప్రాణాలు కోల్పోగా ఒకరు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏడుగురు సాయుధ దళ దుండగులు కార్లు, బైక్‌లపై వచ్చి బార్‌లో ఉన్నవారిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఘటన అనంతరం దుండగులు పారిపోతుండగా పోలీసులు వారిని వెంబడించగా ఒకరు పట్టుపడ్డాడు. మిగిలిన ఆరుగురి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. కాల్పుల్లో ఆరుగురు మహిళలు, ఐదుగురు పురుషులు మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించ్చారు. అయితే ఈ దాడి వెనుక కారణం ఇంకా తెలియరాలేదు.