విశాఖ ఉక్కు కర్మాగారంలో భారీ ప్రమాదం జరిగింది. కరిగించిన ఇనుమును తీసుకెళ్తున్న తొట్టి ఒక్కసారిగా పేలిపోయింది. తొమ్మిది మంది కార్మికులు గాయపడ్డారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రుల్లో ఆరుగురు కాంట్రాక్టు కార్మికులు, ఇద్దరు పర్మినంట్ ఉద్యోగులు, ఒక డీజీఎం ఉన్నారు. వారిని వెంటనే ఫ్యాక్టరీలోని ఆస్పత్రికి తరలించ చికిత్స చేశారు. మరింత మెరుగైన వైద్యం కోసం నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రమాదానికి కారణాలేమిటో తెలియడం లేదని, నిర్లక్ష్యం జరిగి ఉంటే తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గత ఏడాది నవంబర్, 2021 డిసెంబర్ లో జరిగిన ప్రమాదాల్లో భారీ ఆస్తినష్టం జరగింది. పలువురు గాయపడ్డారు.