ఇంటికెళ్లేదాక ఆగలేక.. కొన్నచోటనే పేల్చాడు.. చివరికి.. - MicTv.in - Telugu News
mictv telugu

ఇంటికెళ్లేదాక ఆగలేక.. కొన్నచోటనే పేల్చాడు.. చివరికి..

October 23, 2022

Massive fire breaks out at 2 firecracker shops in Andhra Pradesh Tirupati

 

దీపావళి పండుగ సందర్భంగా ఓ వ్యక్తి షాపుకెళ్లి వెతికి మరీ తనకిష్టమైన థౌజెండ్ వాలా టపాసులు కొన్నాడు. అయితే అవి సరిగా పేలతాయా.? పేలినా సరిగా సౌండ్ వస్తుందా అన్న అనుమానమొచ్చింది. ఇంటికి వెళ్లి పేల్చేదాక ఆగలేక కొనుగోలు చేసిన షాపు ముందే పని మొదలుపెట్టాడు. అతడి అత్యుత్సాహం .. అక్కడున్న మిగతా షాపుల ఓనర్లని ఉరుకులు పరుగులు పెట్టించింది. ఈ ఘటన ఏపీలోని తిరుపతి జిల్లా వడవలపేట మండలం నారాయణదాసు తోటలో చోటు చేసుకుంది. కొనుక్కున్న టపాసుల నాణ్యతను పరిశీలించేందుకు.. షాపు సమీపంలోనే వెలిగించాడు. దీంతో నిప్పురవ్వలు చుట్టుపక్కల ఉన్న దుకాణాల్లోకి ఎగిసి పడి.. షాపులకు మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన చుట్టుపక్కల షాపు ఓనర్లు, పనిచేసే సిబ్బంది వెంటనే అక్కడి నుంచి బయటకు రావడంతో.. పెను ప్రమాదం తప్పింది.

ఈ ఘటనలో సుమారు 20 లక్షల రూపాయల మేర ఆస్తినష్టం జరిగిందని బాధితులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. యజమానుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.