తెలుగు రాష్ట్రాల్లో భారీ మోసం.. రూ. 50 కోట్లు స్వాహా - MicTv.in - Telugu News
mictv telugu

తెలుగు రాష్ట్రాల్లో భారీ మోసం.. రూ. 50 కోట్లు స్వాహా

April 21, 2022

 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విల్లాలు, ఇళ్ల నిర్మాణం పేరుతో భారీ మోసం జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తెలుగు రాష్ట్రాల్లో 1000 చర్చిలను స్థాపిస్తామని పాస్టర్లకు విల్లాలు, నిరుపేద క్రైస్తవులకు ఇళ్లు నిర్మిస్తామని చెప్పి, గుడ్‌షెపర్ట్, ఆర్ అండ్ ఆర్ పౌండేషన్ సంస్థ పేరుతో భారీ మోసానికి పాల్పడ్డారు. సంస్థ పేరుతో ప్రజల నుంచి రూ. 50కోట్లు వసూలు చేశారు.

అనంతరం డబ్బులు చెల్లించిన వారు ఇళ్లను ఎప్పుడెప్పుడు నిర్మిస్తారని ఎదురుచూస్తుండగా బోర్డు తీప్పేశారు. దాంతో కన్నీరు మున్నీరు అయిన బాధితులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో తెలంగాణ, ఏపీలో కలిపి దాదాపు 20 వేల మందివరకు బాధితులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు ఫౌండేషన్ ఛైర్మన్ రఘురామ్, డైరెక్టర్ సాల్మన్ రాజ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఒక్కొక్కరి నుంచి విల్లాల పేరుతో రూ.లక్షల్లో వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.