Massive ice avalanche burst in kashmir Gulmarg 2 foreign nationals lost life
mictv telugu

మంచుకొండ ఇలా చంపింది.. వీడియో

February 1, 2023

 

హిమాలయాల్లో మంచుచరియలు విరిగిపడడం మామూలే. ఎక్కువగా నిర్జన ప్రాంతాల్లో ఇలాంటివి చోటుచేసుకుంటూ ఉంటాయి. మనుషులు అలాంటి ప్రాంతాలను కూడా ఆక్రమించి లేనిపోని ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. కశ్మీర్ లో జరిగిన ప్రమాదమే దీనికి రుజువు. గుల్మార్గ్ ‌లోని మంచుకొండల నడము నిర్వహిస్తున్న అఫర్వత్ పర్యాటక కేంద్రంలో మంచుచరియలు బుధవారం భీభత్సం సృష్టించారు. రిసార్ట్ దగ్గర్లోని చరియలు విరిగిపడ్డంతో ఇద్దరు విదేశీ పర్యాటకులు చనిపోగా కొంతమంది గాయపడ్డాడు. మృతులను పోలండ్ వాసులుగా గుర్తించారు. మంచుచరియలు విరిగిపడుతున్నప్పుడు టూరిస్టులు అతి చేరువలోనే మంచునేలపై కూర్చుని, నిల్చుని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ కనిపించారు. మంచుగడ్డలు బద్దలై దూసుకొస్తున్న దృశ్యాన్ని ఎవరో వీడియో తీశారు. ఇప్పటివరకు 19 మంది విదేశీయులు కాపాడామని బారాముల్లా పోలీసులు చెప్పారు.