Massive increase in Corona cases in India.. What is new?
mictv telugu

భారత్‌లో భారీగా పెరిగిన కరోనా కొత్త కేసులు..

June 30, 2022

 

భారతదేశంలో కరోనా మహమ్మారి వేగం పెంచింది. నిన్న మొన్నటి వరకు 18వేలలోపు ఉన్న కేసులు గడిచిన 24 గంటల్లో భారీగా పెరిగాయి. కరోనా కేసులకు సంబంధించి గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ బులెటెన్ విడుదల చేసింది. విడుదల చేసిన బులెటెన్ ప్రకారం.. ”కొత్తగా 18,819 కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులతో కలిపి మొత్తం 4,34,52,164కు చేరాయి. 4,28,22,493 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,116 మంది కరోనా వల్ల మరణించారు. మరో 1,04,555 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 13,827 కరోనా నుంచి బయటపడగా, 39 మంది మృతిచెందారు.”

అయితే, పెరిగిన కొత్త కేసులతో రోజువారీ పాజిటివిటీ రేటు 4.16 శాతానికి చేరిందని అధికారులు వెల్లడించారు. మొత్తం కేసుల్లో 0.24 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.55%, మరణాల రేటు 1.21 శాతంగా ఉందని తెలిపారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,97,61,91,554 మంది కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారని పేర్కొన్నారు.

మరోపక్క తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో కేసీఆర్ సర్కార్ అప్రమత్తమైంది. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని గురువారం రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాస్ తెలిపారు. ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని అన్నారు. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. వెయ్యి జరిమానా విధిస్తామని ఆయన స్పష్టం చేశారు.