సిమ్లాలో శనివారం ఓ రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చండీగఢ్-సిమ్లా జాతీయ రహదారిపై ధాలీ టన్నెల్ వద్ద వాహనాలపై భారీ కొండచరియ విరిగిపడింది. పలు వాహనాలు కొండరాళ్లతోపాటు లోయలో పడిపోయాయి.
హైవేపై అయితే ప్రాణనష్టం జరిగినట్లు ఇంతవరకు వార్తలేవీ రాలేదు. రాళ్లు, శిథిలాల్లో వాహనాలు చిక్కుకుపోయాయి. కొండ చరియ విరిగిపడుతున్న దృశ్యం సీసీ కెమరాల్లో రికార్డయింది. ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో వరదలు, అడువుల నరికివేత తదితర కారణాల వల్ల కొండ చరియలు విరిగిపడుతుంటం తెలిసిందే.