Massive protest breaks out at Chandigarh University over objectionable videos
mictv telugu

60 మంది విద్యార్థినుల బాత్రూం వీడియోలు లీక్.. యూనివర్శిటీలో గందరగోళం

September 18, 2022

ఆడపిల్లలకు తోటివారి ఆడవారితోనూ భద్రత లేకుండా పోతోంది ఈ రోజుల్లో. ఈ వార్త గురించి తెలిస్తే ఆడవాళ్లకు ఆడవాళ్లే శత్రువు అన్న పాత సామెత గుర్తు రాక మానదు. బాలికల హాస్టల్‌లో విద్యార్థినులు స్నానం చేస్తుండగా ఓ యువతి వీడియో తీసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పంజాబ్‌ మొహాలీలోని చండీగఢ్ యూనివర్సిటీలో శనివారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తాము స్నానం చేస్తున్న వీడియోలు ఇంటర్నెట్ లో ప్రత్యక్షం కావడంతో వారిలోని 8 మంది విద్యార్థినులు అవమానంగా భావించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం వారిని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

 

చండీగఢ్ యూనివర్శిటీలో శనివారం గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిలు స్నానం చేస్తుండగా మరో యువతి వీడియో తీసింది. ఇలా 60 మంది అమ్మాయిలు స్నానం చేస్తున్న వీడియోలను ఫోన్ లో షూట్ చేసింది. ఈ వీడియోలను సిమ్లాలో ఉండే తన బాయ్ ఫ్రెండ్‌కు పంపించింది. అతడు ఆ వీడియోలను సోషల్ మీడియాతోపాటు ఫోర్న్ సెట్లలోనూ అప్ లోడ్ చేశాడు. దీంతో బాధిత విద్యార్థినులు తమ వీడియోలను నెట్ లో చూసి షాక్ తిన్నారు. తీవ్ర మనస్తాపానికి గురైన వారిలోని ఎనిమిది మంది సూసైడ్ అటెంప్ట్ చేశారు. దీనిని యూనివర్సిటీ యజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పెద్దగా పట్టించుకోలేదని విద్యార్థినులు వాపోయారు. ఈ నేపథ్యంలో వర్సిటీ క్యాంపస్ లో పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. అర్ధరాత్రి చండీగఢ్ యూనివర్సిటీని చుట్టుముట్టి ‘వి వాంట్ జస్టిస్’ అంటూ నినాదాలు చేశారు. వారి ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.