హీరోయిన్ ఇంట్లో భారీ చోరీ - MicTv.in - Telugu News
mictv telugu

హీరోయిన్ ఇంట్లో భారీ చోరీ

April 9, 2022

bffbfd

బాలీవుడ్ నటి, అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. రూ. 1.41 కోట్ల విలువైన ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లిపోయారు. ఈ విషయాన్ని సోనమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న సోనమ్ కపూర్ తన తల్లి వద్ద ఉంటోంది. అయితే ఇటీవల ఢిల్లీలోని తన ఇంటికి వెళ్లగా.. అల్మారాలో ఉన్న నగలు, నగదు కనిపంచలేదు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, ఫిబ్రవరి 23వ తేదీన చోరీ జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. చోరీ ఘటనపై పోలీసులు ఆ ఇంట్లో తోటమాలిని, డ్రైవరును, పనివాళ్లను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. కాగా, ప్రస్తుతం ఆ ఇంట్లో సోనమ్ కపూర్ భర్త, అత్తామామలు ఉంటున్నారు.