భారీగా పెరిగిన పెట్రోల్ ధరలు.. లీటర్ రూ. 420 - MicTv.in - Telugu News
mictv telugu

భారీగా పెరిగిన పెట్రోల్ ధరలు.. లీటర్ రూ. 420

May 24, 2022

పూర్తిగా సంక్షోభంలోకి కూరుకుపోయిన ద్వీప దేశమైన శ్రీలంక ఇప్పట్లో కోలుకునే అవకాశాలు కనిపించడం లేదు. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు అడుగంటిపోవడంతో దిగుమతి చేసుకునే వస్తువులపై భారీగా ధరలు పెంచుతోంది. ఈ క్రమంలో ఇంధన ధరలను భారీస్థాయిలో పెంచేసింది. లీటర్ పెట్రోల్‌పై 24.30 శాతం, డీజిలుపై 38.40 శాతం పెంచేసింది. దీని వల్ల లీటర్ పెట్రోల్ ధర రూ. 82 పెరిగి రూ. 420 కి చేరింది. డీజిల్ ధర రూ. 111 పెరిగి రూ. 400 కు చేరింది. పెరిగిన ధరలు మంగళవారం నుంచి అమల్లోకి వస్తాయని సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రకటించింది. దీంతోపాటు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ లంక ఐఓసీ కూడా ఇంధన ధరలను పెంచింది. తద్వారా ఆటో డ్రైవర్లు రవాణా ఛార్జీలు పెంచేసి కిలోమీటరుకు రూ. 90 లు ప్రయాణీకుల వద్ద తీసుకుంటున్నారు. దీంతో అన్ని రకాల ధరలు మరింత పెరిగే పరిస్థితి ఉండగా, సామాన్యులు మాత్రం అల్లాడిపోయే వరకు వచ్చింది. కాగా, మందుల కొరత, ఆహార కొరత ఉన్న నేపథ్యంలో భారత్ తన వంతు సహాయంగా బియ్యం, మెడిసిన్‌లను లంకకు సహాయంగా పంపింది.