Massively increased pradhan manthri suraksha beema yojana premium price
mictv telugu

బ్యాడ్ న్యూస్.. సురక్షా బీమా యోజన ప్రీమియంను భారీగా పెంచిన కేంద్రం

May 31, 2022

Massively increased pradhan manthri suraksha beema yojana premium price

కేంద్రం బ్యాంకు ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు సేవింగ్ అకౌంటుపై ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కింద రూ. 12తో రూ. 2 లక్షల బీమా ప్రయోజనాన్ని అందిస్తుండగా, ఇప్పుడు దానిని ఏకంగా రూ. 456కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ఈ పథకం కింద 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయసున్న వారికి బీమా సౌకర్యం కల్పిస్తోంది. ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత అంగవైకల్యం కలిగినా రూ. 2 లక్షల బీమా, పాక్షిక వైకల్యానికి రూ. 1 లక్ష పరిహారం అందుతుంది. దీని ప్రీమియం ఇప్పటివరకు ఏడాదికి రూ. 12 ఉండగా, ఇక నుంచి రోజుకు రూ. 1.25 చొప్పున ఏడాదికి 456 రూపాయలు వసూలు చేస్తారు. దీనితో పాటు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ప్రీమియాన్ని కూడా కేంద్రం పెంచేసింది. ఇప్పటివరకు ఈ పథకం కింద ఏడాదికి రూ. 330 కడుతుండగా, ఇక నుంచి రూ. 456 లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ఏఎన్‌ఐ వార్తా సంస్థ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.