భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు - MicTv.in - Telugu News
mictv telugu

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

March 10, 2022

అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితుల కారణంగా గత కొద్ది రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ఇవ్వాళ భారీగా తగ్గాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి కంటే రూ. 1600 తగ్గి 48,200 వద్ద నిలిచింది. 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 1750 తగ్గి 52,580 కు చేరింది. వెండి కూడా అదే బాటలో నడిచింది. కేజీకి రూ. 2600 తగ్గి 74,100 కి పడిపోయింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.