బిగ్ బాస్ 3 ఫైనల్స్‌కు మాస్టర్ బాబా భాస్కర్ - MicTv.in - Telugu News
mictv telugu

బిగ్ బాస్ 3 ఫైనల్స్‌కు మాస్టర్ బాబా భాస్కర్

October 26, 2019

baba bhaska. 

అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 చివరి దశకు చేరింది. ఈ ఆదివారంతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ముగుస్తుంది. కాగా, మాస్టర్ బాబా భాస్కర్ జాక్ పాట్ కొట్టారు. బిగ్ బాస్ 3 ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. ఇప్పటికే రాహుల్ సిప్లిగంజ్ నేరుగా ఫైనల్స్‌ చేరుకున్న సంగతి తెలిసిందే. 

శుక్రవారం జరిగిన ఎపిసోడ్‌లో బిగ్ బాస్ కంటెస్టెంట్లకు ఓ టాస్క్ ఇచ్చాడు. ఇన్ని రోజులు బిగ్ బాస్‌లో ఉన్నందుకు వారు ఏమేం పొందారు?, బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఏం మిస్ అవుతారు?, ఏం వదిలి వెళ్లాలనుకుంటున్నారంటూ కొన్ని ప్రశ్నలు అడిగాడు. వాటికి కంటెస్టెంట్లు సమాధానం ఇచ్చారు. తరువాత ఈ వారం ఒకర్ని సేవ్ చేయాల్సిన సమయం వచ్చింది. ఈ సమయంలో బాబా భాస్కర్ మాస్టర్‌ను బిగ్ బాస్ సేవ్ చేశాడు.