తొలి లింగాయత్ సన్యాసిని మద్దతు సిద్దూకే - MicTv.in - Telugu News
mictv telugu

తొలి లింగాయత్ సన్యాసిని మద్దతు సిద్దూకే

April 7, 2018

కర్ణాటక రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. లింగాయతులను హిందువులుగా కాకుండా ప్రత్యేక మతం వారిగా గుర్తించేందుకు సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య నిర్ణయించడంతో ఆ వర్గమంతా ఆయనవైపే నిలిచినట్లు కనిపిస్తోంది. చరిత్రలోనే తొలి లింగాయత్ సన్యాసిని అయిన మాతే మహాదేవి.. సిద్ధరామయ్యను కరుణించారు. లింగాయతులంతా ఆయనకు అండగా నిలబడాలని కోరారు.బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. పచ్చి అబద్ధాలకోరు అని, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాడని మాతె మహాదేవి మండిపడ్డారు. ఈ నెల 18లోపు లింగాయతును ప్రత్యేకమతస్తులుగా ప్రకటించాలని ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. లింగాయతులను హిందువులుగానే గుర్తించాలని అమిత్ షా డిమాండ్ చేస్తుండడంపై ఆమె భగ్గుమన్నారు. మహాదేవికి లింగాయతుల్లో పలుకుబడి ఉంది. ఆమె గతంలో రాసిన బసవ వచన దీప్తి అనే పుస్తకంపై సుప్రీం కోర్టు నిషేధం విధించింది. బసవడి వచనాల్లోని ‘కూడలసంగమ దేవ’కు బదులు లింగదేవ అని మార్చి ఈ పుస్తకాన్ని ప్రచురించారు మహాదేవి.