పురుషులకూ ‘ప్రసూతి’ సెలవులు.. షరతులు వర్తిస్తాయి..  - MicTv.in - Telugu News
mictv telugu

పురుషులకూ ‘ప్రసూతి’ సెలవులు.. షరతులు వర్తిస్తాయి.. 

October 27, 2020

Maternity Leave for Men .jp

సంతానం కలిగిన తర్వాత ప్రసూతి సెలవులు మహిళలకే కాదు.. పురుషులు కూడా తీసుకోవచ్చు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. పిల్లల సంరక్షణ బాధ్యతలు చూసుకునేందుకు పురుషుల కూడా సెలవులు కల్పిస్తున్నామని తెలిపారు.  ప్రభుత్వ ఉద్యోగులకు జీవన సౌలభ్యం కోసం ఈ నిబంధన తీసుకువచ్చామని అన్నారు. చాలా కాలం క్రితమే దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా వచ్చాయని పేర్కొన్నారు. అయితే ఈ సెలవులకు కొన్ని షరతులను విధించారు. 

సింగిల్‌ పెరేంట్‌గా ఉన్న పురుషుడికి మాత్రమే సెలవులు తీసుకునే అవకాశం లభిస్తుంది.  పిల్లలు పుట్టిన తర్వాత భార్య చనిపోతే లేదా విడాకులు పొందిన ఒంటి వ్యక్తి పిల్లల బాధ్యత చూసుకోవాల్సి వస్తే ఇది వర్తించనుంది.  ముందస్తు అనుమతితో సెలవులు తీసుకుంటే.. తొలి 365 రోజులకు గానూ 100 శాతం జీతం చెల్లించనున్నారు. ఆ తర్వాత నుంచి 80 శాతం జీతం ఇవ్వనున్నారు. పిల్లల సంరక్షణ బాధ్యతల కోసం ఎప్పుడైనా సెలవులు పొందవచ్చని కేంద్రం పేర్కొంది. దీంతో మగవారికి కూడా ప్రసూతి సెలవులు లభించే అవకాశం దక్కింది.