ఈ కుక్కపిల్లకు లెక్కలు వచ్చు.. నమ్మకపోతే చూడండి - MicTv.in - Telugu News
mictv telugu

ఈ కుక్కపిల్లకు లెక్కలు వచ్చు.. నమ్మకపోతే చూడండి

March 6, 2018

డాగ్ ఈజ్ మాన్స్ బెస్ట్ ఫ్రెండ్ అంటారు. కుక్కకు నమ్మకంతోపాటు తెలివితేటలు కూడా ఎక్కువ. ఒకసారి చూసిన మనుషులను చాలా రోజుల పాటు గుర్తుపెట్టుకుంటాయి కుక్కలు. అయితే ఈ కుక్కపిల్ల కేవలం మనుషులనే కాదు, అంకెలను, లెక్కలను కూడా బాగా గుర్తుపెట్టుకుంది. మనం ఒక కాగితంపై అంకెరాసి అదేమిటో చెప్పమంటే భౌభౌ అంటూ మొరుగుళ్లతో కచ్చితంగా చెబుతుంది. ఒకటి అని రాసి చూపితే ఒకసారి, మూడు అని  రాసి చూపితే మూడుసార్లు భౌ అంటుంది. కూడికలు, తీసివేతలు, గుణింతాల్లోనూ ఈ కుక్క దిట్టే.

ఆ.. ఇలాంటివి ఎన్నైనా చెబుతార్లే, ఏదో భౌభౌ అంటే లెక్కలు వచ్చినట్టా? అని అనుమానపడకండి. ఈ వీడియో చూస్తే బుల్లికుక్క మేథమేటిక్స్ సత్తా ఏంటో మీకే అర్థం అవుతుంది. ఈ కుక్క వీడియో ఇటీవల సోషల్ మీడియాలో హల్ చేస్తోంది. సదరు శునక మేధావి ఎక్కడున్నాడో మాత్రం తెలియడం లేదు.