కాబోయే భర్త ఇలానే ఉండాలంటూ డిమాండ్.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు - MicTv.in - Telugu News
mictv telugu

కాబోయే భర్త ఇలానే ఉండాలంటూ డిమాండ్.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

October 20, 2022

Matrimonial Ad Seeking Groom With Degrees From Top-Tier Institutes Draws Internet's Ire

 

జీవితంలో పెళ్లి అనేది మన భారత సాంప్రదాయపు ఘట్టం. తాము పెళ్లి చేసుకునే వ్యక్తి పట్ల కొన్ని ఆశలు ఎవరికైనా ఉంటాయి. ముఖ్యంగా అమ్మాయిలు ఈ విషయంలో చాలా క్లారిటీగా ఉంటారు. చూడ్డానికి అందంగా ఉండడంతో పాటు మంచి సంపాదన కూడా ఉండాలనుకుంటారు. ఈ క్రమంలో ఓ యువతి ఇచ్చిన మ్యాట్రిమోని యాడ్ వైరల్ అవుతుంది. తనకు కాబోయే వాడి వయసు, జీతం, ఎత్తు ఎంత ఉండాలి, విద్యార్హతలు ఎలా ఉండాలనే విషయాలను ఓ రెజ్యూమేలా తయారు చేసి పెట్టింది. అది చూసిన వారంతా షాక్ అవుతున్నారు.

సదరు యువతికి కాబోయే వాడు 1992 జున్‌ తర్వాతే జన్మించి ఉండాలంట. ఎంబీఏ, ఎంటెక్, ఎంఎస్‌, పీజీడీఎంలో ఏదో ఒకదానిలో పట్టా ఉండాలి. ఒకవేళ ఇంజినీర్ అయితే.. దేశంలోనే ప్రముఖ విద్యాసంస్థలైన ఐఐటీలు, బిట్స్‌ పిలానీ, ఎన్‌ఐటీ వంటి వాటిల్లోనే ఆ పట్టా పొంది ఉండాలి. ఎంబీఏ అయితే.. ఐఐఎం, ఐఎస్‌బీల్లోనే పూర్తి చేసుండాలి. హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా, బాంబే, ఢిల్లీ, రూర్కీ, ఖరగ్‌పూర్ ఇలా దేశంలోని ముఖ్య నగరాల యూనివర్సిటీల నుంచే డిగ్రీ పొంది ఉండాలట. ఈ కాలేజీల జాబితాను కూడా ఆ అమ్మాయి క్షుణ్నంగా ఫ్రొపైల్‌లో పొందుపరిచింది.

అంతేకాదు జీతం ఏడాదికి కనీసం రూ.30లక్షలు ఉండాలి. అది కూడా కార్పొరేట్ సెక్టార్‌లోనే పనిచేసే వాడే కావాలట. అతడికి తోబుట్టువులు ఇద్దరికంటే ఎక్కువ ఉండకూడదు. బాగా చదువుకున్న కుటుంబానికి కాస్త ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తుందట. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే వరుడి ఎత్తు 5.7 అడుగుల నుంచి 6 అడుగులు ఉండాలట.

ఈ యాడ్‌పై నెటిజన్లు విపరీతంగా రియాక్ట్ అవుతున్నారు.. కొందరైతే ఆ అమ్మాయికి భర్త కాదు.. బ్యాంకు కావాలని కామెంట్ చేయగా.. మరికొందరు పెళ్లి చేసుకుంటుందా..? భర్తను హైర్ చేసుకుంటుందా..? అని ప్రశ్నించారు. మరికొందరైతే ఆ అమ్మాయికి ప్రత్యేకమైన అభిప్రాయాలు ఉండడం తప్పేం కాదంటూ మద్ధతు తెలుపుతున్నారు. మొత్తానికి ఈ పెళ్లి యాడ్.. ఓ రెజ్యూమ్‌లా ఉంది.