‘గణపతి బప్పా’పై ఎంఐఎం ఎమ్మెల్యే వివాదం - MicTv.in - Telugu News
mictv telugu

‘గణపతి బప్పా’పై ఎంఐఎం ఎమ్మెల్యే వివాదం

September 26, 2018

గణేశ్ పూజలో పాల్గొని ‘గణపతి బప్పా మోరియా’ అంటూ నినాదాలు చేసి సంచలనం సృష్టించిన ఎంఐఎం ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పారు. మహారాష్ట్రకు చెందిన మజ్లిస్ ఎమ్మెల్యే వారిన్ పఠాన్ ముంబై బైకుల్లాలోని గణపతి మండపంలో గణేశుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ‘గణపతి బప్పా మోరియా’ అని నినాదాలు చేశారు. అయితే దీనిపై ఎంఐఎం పార్టీ అధిష్ఠానం సీరియస్ అయింది.

rr

ఇస్లాంలో విగ్రహారాధన నిషిద్ధం అని తెలిసి కూడా చేయడం కాదని హెచ్చిరించినట్లు సమాచారం. దీంతో ఆయన క్షమాపణలు చెప్పారు. ‘నేను తప్పు చేశాను. ఇంకోసారి ఇలా చేయను. నేను మనిషిని.. అందుకే పొరపాటు జరిగింది. చేసిన తప్పుకు బాధ పడుతున్నాను. అల్లా నన్ను క్షమించాలి’ అని కోరారు.