కాశీలో మారిషస్ అధ్యక్షుడికి చేదు అనుభవం - MicTv.in - Telugu News
mictv telugu

 కాశీలో మారిషస్ అధ్యక్షుడికి చేదు అనుభవం

February 29, 2020

Mauritius president.

అతిథి దేవో భవ అంటుంది భారతీయ సంస్కృతి. మొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చినప్పుడు మన పాలకులు ఎంత గొప్పగా గౌరవించారో తెలిసిందే. మరోపక్క.. పొరుగునే ఉన్న మారిషస్ అధ్యక్షుడు పృథ్వీరాజ్‌సింగ్ రూపన్ విషయంలో ఈ వ్యవహారం తిరగబడింది. వారణాసి ఎయిర్‌పోర్టులో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది.

భారత అధికారుల వైఫల్యమో, ప్రొటోకాల్‌లో పొరపాట్లో ఏదైనేం.. ఎయిరిండియా ఉద్యోగి ఒకరు ఆయనను అడ్డుకున్నారు. లగేజీ ఎక్కువగా ఉందని, 23 కంటే ఎక్కువగా ఉన్న అదనపు లగేజీకి ఫీజు చెల్లించి ముందుకు కదలాలని అడ్డగించారు. విషయం తెలుసుకున్న ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ ఆగమేఘాలపై అక్కడికి చేరుకుని సర్దిచెప్పారు. తమ ఉద్యోగి తెలియకుండా ఏదో వాగాడని, అందుకు క్షమాపణలు చెప్పాలని కోరారు.  తర్వాత మారిషస్ అధ్యక్షుడి నుంచి అదనపు ఫీజులు గుంజకుండానే ఆయనను విమానం ఎక్కించారు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ట్రంప్‌కు ఒక న్యాయం, మన పొరుగునే ఉన్న దేశాధినేతకు మరో న్యాయమా అని నెటిజన్లు మండిపడుతున్నారు.